కమాల్ ఆర్ ఖాన్.. వివాదాస్పద వ్యక్తి. బాలీవుడ్ సినిమాలను అత్యంత చెత్తగా ఉన్నాయంటూ ఎప్పుడూ రివ్యూ ఇస్తూ ఉంటాడు. అయితే ఇటీవల అతడు ఊహించని విధంగా జైలు పాలయ్యాడు. బాలీవుడ్ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద ట్వీట్లకు సంబంధించి కమల్ ఆర్ ఖాన్‌ను ముంబై విమానాశ్రయం నుండి ఆగస్టు 29 న అరెస్టు చేశారు. కొన్ని రోజుల తర్వాత.. 2021లోని వేధింపుల కేసుకు సంబంధించి మళ్లీ అరెస్టయ్యాడు. అతడికి చివరికి బెయిల్ మంజూరు చేశారు. తాను జైలులో ఉన్న సమయంలో కేవలం నీరు తాగి బతికానని KRK అంటున్నాడు. ఆ సమయంలో తాను 10 కేజీలు బరువు కూడా తగ్గానని అన్నాడు.
"I was surviving with only water for 10 days in lockup. So I have lost 10 kg weight." అంటూ కమాల్ ఆర్ ఖాన్ ట్వీట్ చేశాడు. అయితే నెటిజన్లు అతడు చెప్పిన విషయాన్ని అసలు నమ్మలేకపొతున్నారు. అసలు ఎలా సాధ్యం 10 కిలోలు బరువు తగ్గడం అని పలువురు ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. బెయిల్ పొందిన తర్వాత KRK చేసిన మొదటి ట్వీట్ ఇది మాత్రమే కాదు. కొన్ని రోజుల క్రితం తనను జైలులో పెట్టించిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటానంటూ ఒక ట్వీట్ చేశాడు. అయితే వెంటనే ఆ ట్వీట్ ను డిలీట్ చేశాడు.