నేను చనిపోతే అది హత్యగా భావించండి

నటుడు, దర్శకుడు కమల్ ఆర్ ఖాన్ (కెఆర్‌కె)ని ముంబైలో పోలీసులు అరెస్టు చేశారు.

By Medi Samrat  Published on  25 Dec 2023 7:12 PM IST
నేను చనిపోతే అది హత్యగా భావించండి

నటుడు, దర్శకుడు కమల్ ఆర్ ఖాన్ (కెఆర్‌కె)ని ముంబైలో పోలీసులు అరెస్టు చేశారు. దుబాయ్ వెళ్లేందుకు ముంబయి విమానాశ్రయానికి చేరుకున్న నటుడిని అరెస్ట్ చేశారు. ఈ అరెస్టు 2016 నాటి కేసుకు సంబంధించింది. కమల్ ఖాన్ తన అరెస్టు గురించి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. గత ఏడాది కాలంగా తాను ముంబైలో నివసిస్తున్నట్లు రాశారు. కేసులకు సంబంధించి కోర్టుకు హాజరవుతూనే ఉన్నానని ఆయన అన్నారు.

"నేను న్యూ ఇయర్ సెలబ్రేషన్‌స్ లో పాల్గొనడానికి దుబాయ్‌కి వెళుతున్నాను. కానీ ముంబై పోలీసులు నన్ను విమానాశ్రయంలో అరెస్టు చేశారు. పోలీసుల ప్రకారం, 2016 కేసుకు సంబంధించి నేను వారి వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నాను. సల్మాన్ ఖాన్ టైగర్ 3 సినిమా వైఫల్యానికి కారణం నేనే అని కూడా ప్రచారం జరుగుతూ ఉంది.. ఏది ఏమైనా నేను పోలీస్ స్టేషన్‌లోనో, జైలులోనో చనిపోతే అది హత్య అని అందరూ గుర్తు పెట్టుకోండి. వీటన్నిటికీ బాధ్యులు ఎవరో అందరికీ తెలుసు" అని KRK పోస్ట్ చేసారు.

కమల్ ఖాన్ 2022లో కూడా అరెస్టయ్యాడు. అది కూడా రెండుసార్లు. దివంగత నటులు ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్ ల గురించి అతను సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌లను అరెస్టు చేశారు. రెండోది తన సొంత ఫిట్‌నెస్ ట్రైనర్‌గా ఉన్న యువతిని లోబరుచుకోడానికి ప్రయత్నించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించిన ఘటన 2019లో జరగగా.. 2021లో మహిళ అతడిపై ఫిర్యాదు చేసింది. దీంతో అధికారులు కేసు నమోదు చేశారు.

Next Story