కల్కి ఓటీటీ విడుదలపై కీలక ప్రకటన

కల్కి 2898 AD బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఈ ప్రాజెక్ట్‌తో ప్రభాస్ సలార్ తర్వాత వరుసగా రెండో హిట్ అందుకున్నాడు.

By Medi Samrat  Published on  16 July 2024 9:00 PM IST
కల్కి ఓటీటీ విడుదలపై కీలక ప్రకటన

కల్కి 2898 AD బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఈ ప్రాజెక్ట్‌తో ప్రభాస్ సలార్ తర్వాత వరుసగా రెండో హిట్ అందుకున్నాడు. ఈ చిత్రం థియేటర్లలో నడుస్తుండగా, అభిమానులు కల్కి 2898 AD OTT స్ట్రీమింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమా PR బృందం కల్కి 2898 AD OTT స్ట్రీమింగ్ పై కీలక ప్రకటన చేసింది. థియేటర్‌లలో విడుదలైన 10 వారాల తర్వాత మాత్రమే ఓటీటీ విడుదల చేయడం జరుగుతుందని ధృవీకరించింది. కాబట్టి స్ట్రీమింగ్ ఆగస్టు చివరి వారాంతంలో లేదా సెప్టెంబర్ 1వ వారంలో షెడ్యూల్ చేసే అవకాశం ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసింది, నెట్‌ఫ్లిక్స్ కల్కి హిందీ OTT హక్కులను కలిగి ఉంది.

18 రోజుల తర్వాత, ఈ చిత్రం భారతదేశంలో దాదాపు రూ. 670 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఓవర్సీస్ కలెక్షన్లు దాదాపు రూ. 240 కోట్ల గ్రాస్ వద్ద ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా టోటల్ గ్రాస్ రూ. 910 కోట్లు. ఈ సినిమా రూ. 1000 కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతోంది.

Next Story