'సర్కారు వారి పాట' నుండి మరో సర్‌ఫ్రైజ్ ప్రోమో..
Kalaavathi song promo released from sarkaru vaari paata. మహేష్ బాబు, కీర్తి సురేష్‌ల కాంబినేషన్ లో 'సర్కారు వారి పాట' సినిమా వస్తోంది.
By Medi Samrat Published on
11 Feb 2022 1:54 PM GMT

మహేష్ బాబు, కీర్తి సురేష్‌ల కాంబినేషన్ లో 'సర్కారు వారి పాట' సినిమా వస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు. ఇక మొదటి పాట.. అతి త్వరలోనే రాబోతోంది. ప్రేమికుల దినోత్సవం, ఫిబ్రవరి 14, 2022 న 'కళావతి సాంగ్' ప్రోమోను విడుదల చేయనున్నారు. మేకర్స్ ఈ పాటకు సంబంధించిన ప్రోమో వీడియోను విడుదల చేసారు అభిమానులు మహేష్ బాబు, కీర్తి సురేష్ కెమిస్ట్రీకి ఫిదా అవుతున్నారు. ఎస్.తమన్ స్వరకల్పనలో సిద్ శ్రీరామ్ ఈ పాటను పాడాడు.
మధి సినిమాటోగ్రాఫర్. సర్కారు వారి పాటను GMB ఎంటర్‌టైన్‌మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారువారి పాట' సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. మే 12వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. లిరికల్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. "వందో .. ఒక వెయ్యో .. ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా .. ఏందే ఈ మాయ" అంటూ ఈ పాట మొదలవుతోంది. కీర్తి సురేశ్ ను ఫాలో అవుతూ మహేశ్ బాబు చూపిస్తున్న మేనరిజంలు అచ్చం పోకిరి సినిమాను తలపిస్తూ ఉన్నాయి.
Next Story