సర్కారు వారి పాట నుండి ఒరిజినల్ 'కళావతి సాంగ్' వచ్చేసింది

Kalaavathi Song From Sarkaru Vaari Paata. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా

By Medi Samrat  Published on  13 Feb 2022 4:31 PM IST
సర్కారు వారి పాట నుండి ఒరిజినల్ కళావతి సాంగ్ వచ్చేసింది

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా 'సర్కారు వారి పాట'. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ మొదలయ్యాయి. గత కొద్దిరోజులుగా కళావతి సాంగ్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్న సమయంలో నేడు విడుదలైంది. ఈ పాటను ప్రేమికుల రోజున విడుదల చేయాలని అనుకున్నారు. అయితే ముందుగానే లీక్ అయిపోయింది. దీంతో చిత్ర యూనిట్ పాటను విడుదల చేయాల్సి వచ్చింది. ఇక అభిమానులు పాటను ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు.


వాలంటైన్స్‌ డే​కు మహేశ్‌ ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేయాలనుకున్న మూవీ టీంకు షాకిస్తూ ఒకరోజు ముందుగానే ఈ పాటను ఆన్‌లైన్‌లో లీక్‌ చేశారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా మూవీ టీజర్ ఇలాగే లీక్ అయ్యిందని.. ఇప్పుడు కళావతి పాట కూడా లీక్ అయింది. పాటను లీక్‌ చేసిన ఇద్దరు వ్యక్తులను గుర్తించి వారిని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించింది చిత్ర యూనిట్. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.


Next Story