విదేశాలకు జూనియర్ ఎన్టీఆర్..?

జూనియర్ ఎన్టీఆర్ విదేశాలకు పయనమయ్యారు. వచ్చే వారం ఎన్టీఆర్ పుట్టినరోజు జరుపుకోనుండడంతో ఆయన విదేశాలలో తన కుటుంబంతో సమయాన్ని స్పెండ్ చేయనున్నాడు.

By Medi Samrat  Published on  15 May 2024 5:30 AM GMT
విదేశాలకు జూనియర్ ఎన్టీఆర్..?

జూనియర్ ఎన్టీఆర్ విదేశాలకు పయనమయ్యారు. వచ్చే వారం ఎన్టీఆర్ పుట్టినరోజు జరుపుకోనుండడంతో ఆయన విదేశాలలో తన కుటుంబంతో సమయాన్ని స్పెండ్ చేయనున్నాడు. మే 20న ఆయన పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో భారీ సందడి ఉంటుంది. ముఖ్యంగా ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించిన పోస్టర్లు, టీజర్లు విడుదల చేసేందుకు ఆయన చిత్రాల నిర్మాతలు సిద్ధమవుతున్న తరుణంలో సెలవులపై వెళ్లిపోయారు.

ఎన్టీఆర్, ఆయన సతీమణి ప్రణతి నందమూరి హైదరాబాద్‌ విమానాశ్రయం నుండి బయలుదేరారు. వారు విహారయాత్రకు వెళుతున్నారా లేక ఎక్కడికైనా వెళ్తున్నారా అనేది స్పష్టంగా తెలియడం లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబంతో విదేశాలకు వెళ్లారని ప్రచారం చేశారు. ఇక ఫోటోగ్రాఫర్లు ఎన్టీఆర్ కు అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే చెప్పగా.. ఆయన ధన్యవాదాలు చెప్పుకుంటూ వెళ్లిపోయారు. ఎన్టీఆర్ ఇటీవల తన మొదటి బాలీవుడ్ ప్రాజెక్ట్ "వార్ 2" కోసం సుదీర్ఘ షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసారు. పుట్టినరోజు వేడుకల తర్వాత మిగిలిన షూటింగ్ చేయనున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రెండు ప్రాజెక్ట్‌లు ప్రోగ్రెస్‌లో ఉన్నాయి. అవి "దేవర పార్ట్ 1", "వార్ 2." ఈ సినిమాలకు సంబంధించిన టీజర్ల కోసం అభిమానులు మే 20 తేదీ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.

Next Story