కాంతార-2 షూటింగ్ లో ఊహించని విషాదం

రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్న 'కాంతారా: చాప్టర్ 1' లో ఊహించని విషాదం చోటు చేసుకుంది. ఒక జూనియర్ ఆర్టిస్ట్ మరణంతో సినిమా అకస్మాత్తుగా ఆగిపోయింది.

By Medi Samrat
Published on : 7 May 2025 9:15 PM IST

కాంతార-2 షూటింగ్ లో ఊహించని విషాదం

రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్న 'కాంతారా: చాప్టర్ 1' లో ఊహించని విషాదం చోటు చేసుకుంది. ఒక జూనియర్ ఆర్టిస్ట్ మరణంతో సినిమా అకస్మాత్తుగా ఆగిపోయింది. కేరళకు చెందిన ఎంఎఫ్ కపిల్ కొల్లూరు సౌపర్ణిక నదిలో మునిగిపోయాడు. భోజన విరామం తర్వాత నదిలో ఈతకు వెళ్లిన కపిల్ బలమైన ప్రవాహంలో కొట్టుకుపోయారని సమాచారం.

స్థానిక అధికారులు, అగ్నిమాపక శాఖతో కలిసి వెంటనే గాలింపు, రక్షణ చర్యలను ప్రారంభించారు. సాయంత్రం తరువాత కపిల్ మృతదేహాన్ని నది నుండి వెలికితీశారు. కొల్లూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ సంఘటన పై దర్యాప్తు జరుగుతోంది. ఈ ప్రమాదం సినిమా షూటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపింది. కాంతారా సీక్వెల్ అయిన కాంతారా 2 చిత్రం అక్టోబర్ 2025లో విడుదల కానుంది. కొద్ది నెలల క్రితమే ఈ చిత్రంలోని జూనియర్ ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఇంతలో మరో విషాదం చోటు చేసుకుంది.

Next Story