ఎన్టీఆర్ 'వార్-2' ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే..!

హృతిక్ రోషన్-ఎన్టీఆర్ కలిసి నటించిన వార్ 2 సినిమా ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైంది.

By -  Medi Samrat
Published on : 15 Sept 2025 8:20 PM IST

ఎన్టీఆర్ వార్-2 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే..!

హృతిక్ రోషన్-ఎన్టీఆర్ కలిసి నటించిన వార్ 2 సినిమా ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైంది. అదే సమయంలో విడుదలైన కూలీ ఇప్పటికే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే వార్ 2 సినిమా OTT విడుదలకు 8 వారాల థియేట్రికల్ విండోను కలిగి ఉంది. నివేదికల ప్రకారం, ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. వార్ 2 అక్టోబర్ 9 నుండి అన్ని భాషలలో OTTలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఈ చిత్రానికి రివ్యూలు దారుణంగా వచ్చాయి. ఎన్టీఆర్ అభిమానులు కోరుకున్నట్లుగా సినిమా లేకపోవడంతో స్పై యాక్షన్ డ్రామా థియేటర్లలో పెద్దగా ప్రేక్షకులను చేరుకోలేదు. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాపై చాలా తక్కువ ఆసక్తిని చూపించారు. నెట్‌ఫ్లిక్స్ లో విడుదలైన తర్వాత ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మల్టీస్టారర్ సినిమాకు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ఈ చిత్రంలో కియారా అద్వానీ కీలక పాత్రలో నటించింది.

Next Story