నడిరోడ్డుపై అభిమాని ఫోన్‌ లాక్కున్న స్టార్‌ హీరో​.. ఒక్కసారిగా షాకైన

John abraham snatches fans phone. తమ అభిమాన హీరోలు కనిపిస్తే ఫోటో దిగాలి అని అందరికి అనిపిస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఎవరైనా తమ అభిమాన హీరోలు కనిపిస్తే వెళ్లి

By అంజి  Published on  20 Nov 2021 2:54 PM IST
నడిరోడ్డుపై అభిమాని ఫోన్‌ లాక్కున్న స్టార్‌ హీరో​.. ఒక్కసారిగా షాకైన

తమ అభిమాన హీరోలు కనిపిస్తే ఫోటో దిగాలి అని అందరికి అనిపిస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఎవరైనా తమ అభిమాన హీరోలు కనిపిస్తే వెళ్లి ఫోటోలు దిగుతుకనిపిస్తుంటారు. తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అయ్యిందంటే చాలు షర్ట్స్‌ చింపుకొనే అభిమానులున్నారు. అలాగే హీరోలుకూడా తమ అభిమానులపై మమకారం చూపిస్తుంటారు. ఇక తమ హీరో కనిపించినప్పుడు అతడిని ఫొటోలు తీస్తుంటాం. తాజాగా బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో జాన్‌ అబ్రహం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరు అభిమానులు బైక్‌పై కూర్చొని జాన్‌ అబ్రహం కనిపించేలా సెల్ఫీ వీడియో తీసుకుంటున్నారు.

ఇది గమనించిన జాన్‌ అబ్రహం వాళ్ల దగ్గరికి వెళ్లి ఒక్కసారిగా వాళ్ల చేతుల్లోంచి ఫోన్‌ లాక్కున్నాడు. ఆ తర్వాత ఫోన్‌ కెమెరా వైపు చూస్తూ.. హాయ్ గాయ్స్ ఇప్పుడు ఒకేనా..? అంటూ నవ్వుతూ మాట్లాడాడు. వీళ్ల నా స్నేహితులంటూ వీడియోలో మాట్లాడాడు. ఈ ఘటనతో అభిమానులు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులను ఒక స్టార్‌ హీరో ఫన్నీగా ఆటపట్టించడం భలేగుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం హీరో జాన్‌ అబ్రహం సత్యమేవజయతే-2 సినిమాలో నటిస్తున్నాడు. నవంబర్ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Next Story