HBO సిరీస్ House of the Dragon S2 అఫీషియల్ ట్రైలర్‌ను ప్రకటించిన జియో సినిమా
మే 15, 2024 – రక్తపాతానికి రంగం సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన సిరీస్ గా హౌస్ ఆఫ్ ద డ్రాగన్ కు పేరుంది.
By Medi Samrat Published on 15 May 2024 6:00 PM IST
మే 15, 2024 – రక్తపాతానికి రంగం సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన సిరీస్ గా హౌస్ ఆఫ్ ద డ్రాగన్ కు పేరుంది. అలాంటి షో త్వరలో హౌస్ ఆఫ్ ద డ్రాగన్ ఎస్2 రాబోతుంది. ఈ సిరీస్ ఎప్పుడు విడుదల అవుతుందా, ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. దీంతో.. ఈ సిరీస్ కు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ విడుదలను ప్రకటించింది జియో సినిమా. ఇది ప్రత్యేకంగా జియో సినిమా ప్రీమియమ్ లో స్క్రీమింగ్ కానుంది. అంతేకాకుండా ఈ హౌస్ ఆఫ్ ద డ్రాన్ ఎస్2 సిరీస్.. భారతీయ బాషలైన ఇంగ్లిష్, హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, బెంగాలి మరియు మరాఠి బాషల్లో జూన్ 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అమెరికాతో పాటు భారతదేశంలోనూ ప్రతీ భాగం సోమవారం విడుదల కానుంది.
ప్రసిద్ధి పొందిన జార్జ్ ఆర్.ఆర్. మార్టిన్ యొక్క “ఫైర్ & బ్లడ్” ఆధారంగా, ఈ సిరీస్ హౌస్ టార్గారియన్ కథను చెప్తుంది. గొప్ప కుటుంబంలో రాజకీయ కుట్రలు, కుటుంబ వైషమ్యాలు సర్వసాధారణం. అయితే ఈ కుట్రలు అన్నీ జరిగివే సింహాసనం కోసమే. ఇక్కడే కూడా అలాంటి యుద్ధమై జరుగుతుంది. ఈ కుట్రలు అన్నీ అంతర్యుద్ధానికి ఎలా దారి తీశాయి, అసలేం జరిగింది అనేదే అసలు కథ. డ్రాగన్‌లు మరియు రాజవంశాల ప్రపంచంలో సెట్ చేయబడిన ఈ సిరీస్, ఆశయం, విధేయత మరియు ద్రోహం యొక్క విభిన్న పార్శ్వాలను ప్రదర్శిస్తుంది. అంతిమంగా ఏడు రాజ్యాలపై నియంత్రణ కోసం పోటీపడే కీలక వ్యక్తుల కథే ఈ సిరీస్.
ఇక ఈ సిరీస్ లో నటించిన నటీనటుల విషయానికి వస్తే.. మాట్ స్మిత్, ఒలివియా కుక్, ఎమ్మా డి ఆర్సీ, ఈవ్ బెస్ట్, స్టీవ్ టౌస్సేంట్, ఫాబియన్ ఫ్రాంకెల్, ఇవాన్ మిచెల్, టామ్ గ్లిన్-కార్నీ, సోనోయా మిజునో మరియు రైస్ ఇఫాన్స్ నటించారు. హ్యారీ కొల్లెట్, బెథానీ ఆంటోనియా, ఫోబ్ కాంప్‌బెల్, ఫియా సబాన్, జెఫెర్సన్ హాల్ మరియు మాథ్యూ నీధమ్ వంటి అదనపు రిటర్నింగ్ తారాగణం ఇందులో కన్పిస్తారు. కొత్త సీజన్‌లో అబూబకర్ సలీం, గేల్ రాంకిన్, ఫ్రెడ్డీ ఫాక్స్, సైమన్ రస్సెల్ బీల్, క్లింటన్ లిబర్టీ, జామీ కెన్నా, టామ్ బెన్నెట్, టామ్ టేలర్ మరియు విన్సెంట్ రీగన్ వంటి ప్రముఖులు కన్పిస్తారు.
మరోవైపు జియోసినిమా ప్రీమియమ్ లో హౌస్ ఆఫ్ ద డ్రాన్ ఎస్ 2 మాత్రమే కాకుండా... ఎన్నో అద్భుతమైన అంతర్జాతీయ సిరీస్ లను కూడా మీకు నచ్చిన భాషలో చూసే అవకాశం ఉంది. సినిమాలు, సిరీస్ లతో పాటు చిన్నారులకు, మరియు కుటుంబం మొత్తానికి కావాల్సిన ఎంటర్ టైన్ మెంట్ ఇక్కడ అందుబాటులో ఉంటుంది. వీటితోపాటు.. ఒరిజినల్ షోలు, బ్లాక్‌బస్టర్ సినిమాలు, టీవీ ప్రీమియర్‌లు అన్నీ 4K క్వాలిటీతో అందించబడతాయి. ఇవన్నీ కేవలం ఒక డివైజ్ కు నెలకు రూ. 29 మాత్రమే లేదా రూ. గరిష్టంగా 4 ఏకకాల స్క్రీన్‌లకు నెలకు రూ.89 మాత్రమే.
మరి ఇంకెందుకు ఆలస్యం? జియో సినిమా ప్రీమియం సబ్ స్కైబ్ చేసుకోండి. హౌస్ ఆఫ్ ద డ్రాగన్ ఎస్2 తో పాటు మరెన్నో అద్భుతమైన షోలను మీ భాషలో వీక్షించండి!