2020 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును సొంతం చేసుకున్న సినిమా!

'Jersey' bags Best Film in Telugu.2020 దాదా సాహెబ్ పాల్కే అవార్డు జాబితాలో ది బెస్ట్ సినిమాగా నాని నటించిన తెలుగు జెర్సీ సినిమా అవార్డును సొంతం చేసుకోనుంది.

By Medi Samrat  Published on  3 Jan 2021 6:41 AM IST
Jersey Telugu Movie

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఫిలింఫేర్ అవార్డులు, నంది అవార్డులు, వంటివి కేటగిరీల వారీగా అందిస్తుంటారు. ప్రస్తుతం 2020 సంవత్సరం ముగియడంతో చిత్రపరిశ్రమ 2020 ఏడాదికిగాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు జాబితాలను ప్రకటించింది. చిత్ర పరిశ్రమకు సంబంధించిన అన్ని కేటగిరీలకు అవార్డులను ప్రకటించారు. అయితే 2020 సంవత్సరంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును సొంతం చేసుకున్న సినిమా, హీరో, హీరోయిన్, సంగీత దర్శకులు ఎవరో ఇక్కడ చూద్దాం..

2020 ఏడాదికిగాను సౌత్ కేటగిరిలో ది బెస్ట్ సినిమాగా నాని నటించిన జెర్సీ సినిమా..దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును సొంతం చేసుకోనుంది. ఇక బెస్ట్ యాక్టర్ అవార్డును నవీన్ పోలిశెట్టి కైవసం చేసుకున్నారు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాలో నటించినందుకు గాను నవీన్ ఈ అవార్డును దక్కించుకున్నారు. 2020 ఏడాదికి ఉత్తమ నటిగా రష్మిక మందనా ఈ అవార్డును దక్కించుకోనున్నారు. రష్మిక నటించిన డియర్ కామ్రేడ్ చిత్రంలో ఆమె నటనకు ఉత్తమ నటిగా ఈ అవార్డును సొంతం చేసుకున్నారు.


డైరెక్షన్ కేటగిరిలో అధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సాహో చిత్ర దర్శకుడు సుజిత్ బెస్ట్ డైరెక్టర్ అవార్డుకు ఎంపికయ్యారు. అంతేకాకుండా మ్యూజికల్ కేటగిరికి సంబంధించి ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డును ఎస్.ఎస్.తమన్ సొంతం చేసుకున్నారు. అలా వైకుంఠపురం సినిమాకు మంచి మ్యూజికల్ హిట్ అందించినందుకు గాను తమన్ ఈ అవార్డును సొంతం చేసుకున్నారు.ఇక మోస్ట్ వర్సటైల్ యాక్టర్ అవార్డును సైతం అక్కినేని నాగార్జున అందుకోనున్నారు.


Next Story