నా న్యూడ్ ఫొటోలను ఎవరైనా చూడొచ్చు.. ఆ గాయం నన్ను వెంటాడుతోంది: నటి

Jennifer lawrence response on nude pictures leak in 2014. తన న్యూడ్‌ ఫొటోలను ఇప్పుడు ఎవరైనా, ఎప్పుడైనా తన అనుమతి లేకుండా చూడొచ్చని ప్రముఖ హాలీవుడ్‌ నటి జెన్నీఫర్‌ లారెన్స్ బాధపడుతూ చెప్పింది.

By అంజి  Published on  24 Nov 2021 11:52 AM IST
నా న్యూడ్ ఫొటోలను ఎవరైనా చూడొచ్చు.. ఆ గాయం నన్ను వెంటాడుతోంది: నటి

తన న్యూడ్‌ ఫొటోలను ఇప్పుడు ఎవరైనా, ఎప్పుడైనా తన అనుమతి లేకుండా చూడొచ్చని ప్రముఖ హాలీవుడ్‌ నటి జెన్నీఫర్‌ లారెన్స్ బాధపడుతూ చెప్పింది. 'ది హంగర్‌ గేమ్స్‌' మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో జెన్నీఫర్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా తన న్యూడ్‌ ఫోటోలు లీక్‌ అయిన విషయంపై మాట్లాడారు. 2014 సంవత్సరంలో హాలీవుడు హీరోయిన్లు రిహన్నా, సెలెనా గోమేజ్‌తో పాటు జెన్నీఫర్‌ లారెన్స్‌ల న్యూడ్‌ ఫొటోలు ఇంటర్‌నెట్‌లో లీక్‌ అయ్యాయి. అప్పట్లో ఇది హాలీవుడ్‌ ఇండస్ట్రీలో పెద్ద సంచలనం రేపింది. న్యూడ్‌ ఫొటోలను పలువురు అజ్ఞాత హ్యాకర్స్‌ ఇంటర్‌నెట్‌లో పెట్టారు.

ఫ్రాన్స్‌ దేశంలో హీరోయిన్ల న్యూడ్‌ ఫొటోలను ప్రచురించారు. జెన్నీ ఫర్‌ మాట్లాడుతూ.. ఎప్పటికీ ఆ గాయం నన్ను వెంటాడుతూనే ఉంటుందన్నారు. అలాగే 2017లో తాను ప్రయాణిస్తున్న ఫ్లైట్‌ ఇంజిన్‌ ఫెయిల్‌ కావడం తనను ఎంతో బలహీనురాలిని చేసిందని జెన్నీఫర్‌ చెప్పారు. ఆ భయం కూడా తనను వెంటాడుతోందని, అయితే ప్రొఫెషన్‌లో భాగంగా విమాన జర్నీ చేయక తప్పట్లేదన్నారు. ప్రస్తుతం 'టైటానిక్‌' స్టార్‌ లియోనార్డో డికాప్రియోతో కలిసి 'డోంట్‌ లుక్‌ అప్టూ దట్‌' అనే రాజకీయ డ్రామా సినిమాలో జెన్నీఫర్‌ నటిస్తోంది. ఈ మూవీ స్క్రీనింగ్‌లో భాగంగా లాస్‌ఎంజెల్స్‌లో జెన్నీఫర్‌ బెబీ బంప్‌తో కనిపించారు. దీంతో ఆమె గర్భవతి అయిందంటూ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.

Next Story