'ఉప్పెన' రిమేక్.. తమిళ స్టార్ తనయుడు.?

Jason Sanjay Starring In Uppena Tamil Remake. తమిళ సూపర్ స్టార్ విజయ్ 'ఉప్పెన' రిమేక్ పై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. తన తనయుడు సంజయ్ ను హీరోగా పరిచయం చేయాలన్న ఉద్దేశంలో ఆయన ఉన్నట్టు సమాచారం.

By Medi Samrat
Published on : 16 Feb 2021 1:32 PM IST

Jason Sanjay Starring In Uppena Tamil Remake

సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఎన్నో అంచనాలతో నటించిన సినిమా "ఉప్పెన". ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. మొదటి నుంచి భారీ అంచనాల మద్య రిలీజ్ అయిన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకొని మంచి కలెక్షన్లు రాబట్టుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి సుకుమార్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం రాక్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ అందించారు. సరికొత్త ప్రేమకథని వినూత్నంగా తెరపై ప్రెజంట్ చేసిన దర్శకుడి ప్రతిభను అందరూ ప్రశంసిస్తున్నారు.

బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తుండటంతో రీమేక్ హక్కుల కోసం అప్పుడే వివిధ భాషల నుంచి ఒత్తిడి మొదలైనట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళ సూపర్ స్టార్ విజయ్ 'ఉప్పెన' రిమేక్ పై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. తన తనయుడు సంజయ్ ను హీరోగా పరిచయం చేయాలన్న ఉద్దేశంలో ఆయన ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే నిర్మాతలతో రీమేక్ హక్కుల విషయంలో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

కోలీవుడ్ స్టార్ హీరో అయిన విక్రమ్ తనయుడు ధృవ్ తెలుగు లో సూపర్ హిట్ అయిన 'అర్జున్ రెడ్డి' రిమేక్ లో నటించిన విషయం తెలిసిందే. ఓ మంచి మాస్ కథ కోసం ఎదురు చూస్తున్న విజయ్ 'ఉప్పెన' మూవీ బాగా నచ్చిందని.. అందుకే తమిళ్ లో రిమేక్ చేసి తన తనయుడిని హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలనే తలంపుతో ఉన్నారట. ఈ విషయంలో త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం వుంది.





Next Story