ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-10 మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్

Jason Momoa Joining Vin Diesel and Family in Fast and Furious 10. యాక్షన్ సినిమా లవర్స్ కు 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' సిరీస్ సినిమాల

By Medi Samrat  Published on  31 Jan 2022 7:44 AM GMT
ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-10 మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్

యాక్షన్ సినిమా లవర్స్ కు 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' సిరీస్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సిరీస్ లో వచ్చిన సినిమాలన్నీ కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తూ వస్తున్నాయి. ఎంతో మంది స్టార్స్ ఈ సిరీస్ లో నటిస్తూ వచ్చారు. తాజాగా మరో బిగ్ స్టార్ ఈ సినిమా సిరీస్ లో భాగమయ్యాడు. గేమ్ ఆఫ్ థ్రోన్స్, ఆక్వా మ్యాన్ స్టార్.. జాసన్ మోమోవా ఫాస్ట్ & ఫ్యూరియస్ 10 తారాగణంలో భాగమైనట్లు యూనివర్సల్ పిక్చర్స్ తెలిపింది. జాసన్ మోమోవా కీలక పాత్ర పోషిస్తున్నాడని. ఈ చిత్రంలో ఒక విలన్‌గా నటించవచ్చని నివేదికలు చెబుతున్నాయి. స్క్రిప్ట్ ఇంకా ప్రోగ్రెస్‌లో ఉన్నందున, మోమోవా పాత్రకు సంబంధించి మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

డ్వేన్ జాన్సన్(ది రాక్) ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9లో నటించలేదు. ఈ ఫ్రాంఛైజ్ లోకి తిరిగి రావాలని విన్ డీజిల్ కోరినా రాక్ స్పందించలేదు. ఆ తర్వాత కొత్త స్టార్ కోసం అన్వేషణ ప్రారంభమైంది. ఫాస్ట్ & ఫ్యూరియస్ ఫ్రాంచైజీ యొక్క 10వ ఇన్‌స్టాల్‌మెంట్‌లో విన్ డీజిల్‌తో పాటు సంగ్ కాంగ్, క్రిస్ లుడాక్రిస్ బ్రిడ్జెస్, జోర్డానా బ్రూస్టర్, టైరీస్ గిబ్సన్, నథాలీ ఇమ్మాన్యుయెల్, మిచెల్ రోడ్రిగ్జ్‌లు చేరారు.

ఎనిమిదవ చిత్రం 'ది ఫేట్ ఆఫ్ ది ఫ్యూరియస్‌'లో మొదటిసారి కనిపించి, F9 కోసం తిరిగి వచ్చిన చార్లీజ్ థెరాన్ కూడా ఈ సినిమాలో సందడి చేయవచ్చని భావిస్తున్నారు. 2021 లో F9: ది ఫాస్ట్ సాగాతో ఫ్రాంచైజీకి తిరిగి వచ్చిన జస్టిన్ లిన్ ఈ ఫ్రాంచైజీలో 10వ మరియు 11వ చిత్రాలకు దర్శకత్వం వహిస్తాడు. ప్రస్తుతానికి 11వ భాగమే ఆఖరి పార్ట్ అని చెబుతున్నారు. 2001లో ప్రారంభమైన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంచైజీ ప్రపంచవ్యాప్తంగా $6.6 బిలియన్లు (దాదాపు రూ. 49,470 కోట్లు) సంపాదించింది. డ్వేన్ జాన్సన్, జాసన్ స్టాథమ్ నటించిన స్పిన్-ఆఫ్ మూవీ 'హాబ్స్ & షా' కూడా ఉంది. మోమోవా ఇటీవల డ్యూన్‌లో కనిపించాడు. 2018లో వచ్చిన హిట్ మూవీ 'ఆక్వామ్యాన్‌'కి సీక్వెల్ అయిన 'ఆక్వామాన్ అండ్ ది లాస్ట్ కింగ్‌డమ్‌'లో నటిస్తున్నాడు. ఫాస్ట్ & ఫ్యూరియస్-10 మే 19, 2023న ప్రపంచవ్యాప్తంగా సినిమా హాళ్లలో విడుదల కానుంది.


Next Story
Share it