ఆ పార్టీలో నేను లేను.. ఇంకెవరు ఆ సెలెబ్రిటీలు.?

బెంగళూరులో పోలీసులు ఓ రేవ్ పార్టీని భగ్నం చేశారని.. తెలుగు సినీ ప్రముఖులు పట్టుబడ్డారని వార్తలు వచ్చాయి.

By Medi Samrat  Published on  21 May 2024 6:45 AM IST
ఆ పార్టీలో నేను లేను.. ఇంకెవరు ఆ సెలెబ్రిటీలు.?

బెంగళూరులో పోలీసులు ఓ రేవ్ పార్టీని భగ్నం చేశారని.. తెలుగు సినీ ప్రముఖులు పట్టుబడ్డారని వార్తలు వచ్చాయి. సీనియర్ నటుడు శ్రీకాంత్, సినీ నటి హేమ ప్రత్యేకంగా వీడియోలను విడుదల చేసి ఈ వార్తలను ఖండించారు. ఇక ప్రముఖ కొరియోగ్రాఫర్, జనసేన నేత జానీ మాస్టర్ కూడా రేవ్ పార్టీలో ఉన్నారని సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా.. జానీ మాస్టర్ వీడియోతో వివరణ ఇచ్చారు. తాను హైదరాబాదులోనే ఉన్నానన్నారు. తెలుగు ఫిలిం, టీవీ డ్యాన్సర్స్, డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ కార్యాలయంలో అందుకు సంబంధించి ఓ వీడియోను చిత్రీకరించారు.

ప్రస్తుతం హైదరాబాదులోని మా యూనియన్ ఆఫీసులో ఉన్నానని జానీ మాస్టర్ వివరణ ఇచ్చారు. నేను రేవ్ పార్టీలో ఉన్నానంటూ ప్రచారం జరుగుతోంది.. అలాంటిదేమీ లేదు.. ఇటీవలి వరకు ఎన్నికలతో నేను బిజీగా ఉన్నానని.. హైదరాబాదులో మా డ్యాన్సర్స్ యూనియన్ లో కొన్ని పనులు ఆగిపోతే వాటి విషయం చూస్తున్నానని తెలిపారు. డైరెక్టర్స్ డే నేపథ్యంలో ఓ నిధుల సేకరణ కార్యక్రమం జరిగితే ఆ షోలో కూడా ఉన్నానన్నారు. వేసవి సెలవుల్లో మా పిల్లలను బయటికి తీసుకెళ్లడానికి కూడా తనకు టైమ్ లేదన్నారు. ఎక్కడికీ వెళ్లలేదని.. హైదరాబాదులో మా యూనియన్ ఆఫీసులోనే ఉన్నానన్నారు.

Next Story