శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ టాలీవుడ్‌ ఎంట్రీ కన్ఫర్మ్ అయినట్లే..!

Janhvi Kapoor Telugu Debut. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ తెలుగు, తమిళ్‌లో ఎంట్రీ గురించి వస్తున్న వార్తలను బోనీ నిజమేనని అన్నారు.

By Medi Samrat
Published on : 8 March 2021 8:11 AM IST

Janhvi Kapoor Telugu Debut

అతిలోక సుందరి శ్రీదేవి బాలీవుడ్ లో ఎంత పెద్ద స్టార్ అయినా కూడా తెలుగు సినిమాలను అసలు వదలలేదు. బాలీవుడ్ లో పెద్ద ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ కూడా తెలుగు సినిమాలు చేసేది. ఇక ఆమె కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకుంటూ ఉండగా.. దక్షిణాదిన కూడా ఆమెకు మంచి ఆఫర్లే వస్తూ ఉన్నాయి. అయితే జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు అన్నది మాత్రం క్లారిటీ రాలేదు. తాజాగా జాన్వీ కపూర్ తండ్రి బోనీ కపూర్ జాన్వీ ఎంట్రీపై ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. జాన్వీ కపూర్ త్వరలోనే తెలుగు, తమిళ భాషల్లో సినిమా చేయబోతోందని అన్నారు. తెలుగు, తమిళ్‌లో జాన్వీ ఎంట్రీ గురించి వస్తున్న వార్తలను బోనీ నిజమేనని అన్నారు.

కాకపోతే రెగ్యులర్‌ మాస్‌మసాలా సినిమాలు కాకుండా స్ట్రాంగ్‌ స్టోరీతో పాటు, డాన్స్‌కి, జాన్వీ చేసే క్యారెక్టర్‌కి, పెరఫారమెన్స్‌ పాయింట్‌ ఆఫ్ వ్యూలో ఎంతో ప్రాధాన్యత ఉండి తీరాలని బోనీ కపూర్ అంటున్నారు. శ్రీదేవి పాపులర్‌ అయిందీ, సూపర్‌స్టార్‌ అయిందీ తెలుగు, తమిళం చిత్రాల ద్వారానే కాబట్టి జాన్వీని కూడా తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. శ్రీదేవి కుమార్తె సినిమా అంటే చాలు.. ఆమె తల్లి మీద ఉన్న అభిమానంతో సినిమా థియేటర్లకు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. జాన్వీ కపూర్ తెలుగు సినిమా కృష్ణవంశీ దర్శకత్వంలో ఉండే అవకాశం ఉందని కూడా అంటున్నారు. త్వరలో అధికారిక ప్రకటన కూడా రావచ్చని చెబుతూ ఉన్నారు.




Next Story