మరణ వార్తలను మీమ్స్‌గా మార్చడంపై నటి జాన్వీ కపూర్ బాధను వ్యక్తం చేశారు. ప్రముఖుల మరణాలను సైతం వినోదం కోసం మీమ్స్‌గా మార్చే సంస్కృతి సరైనది కాదన్నారు. తన తల్లి శ్రీదేవి మరణం గురించి మాట్లాడాల్సి వచ్చిన ప్రతీసారి ఎంతో జాగ్రత్తగా ఉంటానని జాన్వీ తెలిపారు. అమ్మ మరణాన్ని అడ్డం పెట్టుకుని పబ్లిసిటీ సంపాదించుకోవాలని చూస్తున్నానని ప్రజలు అనుకుంటారేమోనన్న భయంతో చాలాసార్లు ఆ విషయంపై మాట్లాడటానికే వెనుకాడానని స్పష్టం చేశారు.
ప్రస్తుత జర్నలిజం, సోషల్ మీడియా తీరు ప్రమాదకరంగా మారుతోందని జాన్వీ అన్నారు. ఇటీవల ధర్మేంద్ర గారు చనిపోయారంటూ వదంతులు సృష్టించి, దానిపైనా మీమ్స్ చేశారు. ఒకరి మరణాన్ని మీమ్‌గా మార్చడం ఎంతో పాపం. ఈ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని జాన్వీ చెప్పారు. 2018 ఫిబ్రవరి 24న దుబాయ్‌లోని ఓ హోటల్‌లో బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తు పడి శ్రీదేవి కన్నుమూశారు. ఆ సమయంలో శ్రీదేవి మరణంపై బాత్ టబ్ మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.