గంభీర‌మైన లుక్ : 'స‌లార్‌'లో ప్ర‌భాస్ ప్ర‌త్య‌ర్ధి అదిరిపోయాడు..!

Jagapathi Babu As 𝐑𝐚𝐣𝐚𝐦𝐚𝐧𝐚𝐚𝐫 from Salar. 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 'సలార్' పేరిట ఓ భారీ చిత్రం రూపొందుతున్

By Medi Samrat  Published on  23 Aug 2021 12:38 PM GMT
గంభీర‌మైన లుక్ : స‌లార్‌లో ప్ర‌భాస్ ప్ర‌త్య‌ర్ధి అదిరిపోయాడు..!

'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 'సలార్' పేరిట ఓ భారీ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ ఢీకొనే విలన్ పాత్ర‌లో జగపతిబాబు నటిస్తున్నారు. చిత్రంలో జగపతిబాబు పాత్ర పేరు రాజమన్నార్. ఇందుకు సంబంధించి జగపతిబాబు లుక్ ను ఈ రోజు చిత్ర బృందం విడుదల చేసింది.

ముక్కుకు రింగుతో.. రౌద్రంతో జగపతి ఈ లుక్ లో కొత్తగా కనిపిస్తున్నారు. ఈ లుక్కును బట్టే ఇది చాలా పవర్ ఫుల్ పాత్ర అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఒకప్పుడు హీరోగా పలు సినిమాలు చేసి, ఫ్యామిలీ హీరో ఇమేజ్ తెచ్చుకున్న ప్రముఖ నటుడు జగపతిబాబు.. తన సెకండ్ ఇన్నింగ్స్ లోనూ పూర్తి భిన్నమైన పాత్రలను పోషిస్తున్నారు. పలు చిత్రాల‌లో కరుడు గట్టిన విలన్ పాత్రలు ధరించిన‌ ఆయ‌న‌.. మ‌రికొన్ని సినిమాల‌లో తండ్రి పాత్ర‌లు చేశారు. ఆచితూచి పాత్ర‌లు ఎంచుకుంటున్న జ‌గ‌ప‌తిబాబు.. ప్రభాస్ ప్ర‌త్య‌ర్థి పాత్ర‌లో ఒదిగిపోతార‌న‌డంలో ఎటువంటి సందేహం లేదు.


Next Story
Share it