200 కోట్ల మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మంజూరైన ఇంటర్మ్ ప్రొటెక్షన్ ను ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు శనివారం నవంబర్ 10 వరకు పొడిగించింది. రెగ్యులర్ బెయిల్, ఇతర పెండింగ్ దరఖాస్తులపై విచారణ నవంబర్ 10న షెడ్యూల్ చేసింది. ఛార్జ్ షీట్, ఇతర సంబంధిత పత్రాలను అందించాలని కోర్టు ఈడీని ఆదేశించింది.
విచారణకు జాక్వెలిన్ స్వయంగా హాజరైంది. ఆ సమయంలో జాక్వెలిన్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. విచారణ కోసం ఫెర్నాండెజ్ తన లాయర్ ప్రశాంత్ పాటిల్‌తో కలిసి కోర్టుకు హాజరైంది. బెయిల్ దరఖాస్తుపై ప్రత్యుత్తరం దాఖలు చేయాలని ఈడీని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఆగస్టు 17న ఢిల్లీ కోర్టులో మోసగాడు చంద్రశేఖర్‌పై దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన అనుబంధ చార్జిషీటులో ఫెర్నాండెజ్ పేరును నిందితుల లిస్టులో పేర్కొంది. చంద్రశేఖర్ నుండి ఆమె అత్యంత ఖరీదైన బహుమతులు, BMW కార్లను పొందారని ఈడీ ఆరోపించింది.
అయితే ఈ ఆరోపణలతో తనకు ఎలాంటి సంబంధం లేదని జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్పష్టం చేసింది. సుకేష్ చంద్రశేఖర్, అతని సహచరులు చేసిన పనులకు, నేరపూరిత చర్యలకు తానే బాధితురాలిని ఆమె చెబుతోంది.