సుడిగాలి సుధీర్‌ టీం జబర్దస్త్‌ను వీడనుందా.. ఏం జరిగింది.!

Jabardasth sudigali sudeer agrimant isssu. తెలుగు టెలివిజన్‌ చరిత్రలో జబర్దస్త్‌ కామెడీ షోకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ షో ఎంతో మంది కమెడియన్స్‌ జీవితాల్లో వెలుగులు

By అంజి  Published on  13 Nov 2021 4:31 PM IST
సుడిగాలి సుధీర్‌ టీం జబర్దస్త్‌ను వీడనుందా.. ఏం జరిగింది.!

తెలుగు టెలివిజన్‌ చరిత్రలో జబర్దస్త్‌ కామెడీ షోకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ షో ఎంతో మంది కమెడియన్స్‌ జీవితాల్లో వెలుగులు నింపింది. ఇప్పటికి కూడా ఎంతో మంది జబర్దస్త్‌ షో ద్వారా ఉపాధి పొందుతున్నారు. జబర్దస్త్‌లో ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌ టీం ఎంతో గుర్తింపు సంపాదించింది. ఇక సుడిగాలి సుధీర్‌ బుల్లితెరపై ఎంతో మంది అభిమానుల సంపాదించుకున్నాడు. అయితే బుల్లితెర స్టార్‌గా మారిన సధీర్‌ జబర్దస్త్‌ షో నుంచి బయటకు వచ్చినట్లు సమాచారం. సుధీర్‌తో పాటు అతనితో స్నేహితులు గెటప్‌ శీను, ఆటో రాంప్రసాద్‌లు కూడా జబర్దస్‌ షో నుండి బయటకు రావాలని భావిస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. సుడిగాలి సుధీర్‌ టీమ్‌కి జబర్దస్‌తో మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఒక వేళ వీరు ఈ షో నుంచి బయటికి వెళ్లిపోతే రేటింగ్‌ అమాంతం పడిపోయే ఛాన్స్‌ ఉంది.

ఇదే విషయమై నిర్వాహకులు ఆందోళన పడుతున్నారని తెలుస్తోంది. జబర్దస్‌ షోను నిర్వహించే మల్లెమాల సంస్థ ప్రతి సంవత్సరం జబర్దస్త్‌ కమెడియన్స్‌తో అగ్రిమెంట్‌పై సంతకం చేయించుకుంటుంది. అయితే ఈ సారి అగ్రిమెంట్‌పై సంతకం చేయడానికి సుడిగాలి సుధీర్‌ నిరాకరించాడి సమాచారం. సుడిగాలి సుధీర్‌తో పాటు మిగతా కమెడియన్స్‌కి ఈ కార్యక్రమం ఎంతో ఫేమ్‌ వచ్చింది. దీంతో వీరికి సినిమా ఛాన్స్‌లు, ఇతర కార్యక్రమాల్లో ఆఫర్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక జబర్దస్త్‌ షోకు మాత్రమే పరిమితం కాకూడదని భావించినట్లు ఉన్నారు. అయితే ఈ విషయంపై మల్లెమాల సంస్థ కూడా స్పందించలేదు.

Next Story