'జబర్దస్త్' నటుడు అదిరే అభికి ప్రమాదం

Jabardasth comedian Adhire Abhi Get accident in film shooting.అభినయ కృష్ణ అలియాస్ అదిరే అభి జబర్దస్ కామెడీ షో ద్వారా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Jun 2022 3:49 PM IST
జబర్దస్త్ నటుడు అదిరే అభికి ప్రమాదం

అభినయ కృష్ణ అలియాస్ అదిరే అభి జబర్దస్ కామెడీ షో ద్వారా మంచి పేరు తెచ్చుకున్నాడు. సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాడు. ప్రభాస్ నటించిన 'ఈశ్వర్'లో ఫ్రెండ్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి అభి యాంకర్‌గా, డ్యాన్సర్‌గా, స్టాండ్-అప్ కమెడియన్‌గా పనిచేస్తున్నాడు.

తాజాగా అతడు నటిస్తున్న షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో కొనసాగుతోంది. ఈ చిత్ర షూటింగ్ లో భాగంగా తాజాగా యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ క్రమంలో ఫైటర్ ను ఎదుర్కొనే సమయంలో అదిరే అభి ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదంలో చేతికి, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ముఖ్యంగా చేతికి పెద్దగాయమే తగిలింది. వెంటనే ఆస్ప్రత్రికి తరలించారు. దాదాపు 15 కుట్లు పడ్డాయని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి క్షేమంగా ఉందన్నారు. అభి ప్రస్తుతం కోలుకుంటున్నాడని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటే స‌రిపోతుంద‌ని అంటున్నారు.

Next Story