షూటింగ్ పూర్తీ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఆ స్పెషల్ వీడియో చూశారా.?
తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో విజయ్ దేవరకొండ-మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న 'ఫ్యామిలీ స్టార్' సినిమా ఒకటి
By Medi Samrat Published on 16 March 2024 9:15 PM ISTతెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో విజయ్ దేవరకొండ-మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న 'ఫ్యామిలీ స్టార్' సినిమా ఒకటి. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు ఓ వైపు ఊపందుకున్నాయి. మరో వైపు ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ మొత్తం పూర్తయిందని చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. ఏప్రిల్ 5న సినిమా విడుదల కానుంది. ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్ లో దేవర పార్ట్-1 ఆరోజున రావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వలన వాయిదా పడింది. ఇప్పుడు దేవరకొండ ఫ్యామిలీ స్టార్ తో మన ముందుకు వస్తున్నాడు.
ఫ్యామిలీ స్టార్ సినిమా నుండి మేకర్స్ ఇటీవలే సెకండ్ సింగిల్‌ను విడుదల చేశారు. దీనికి మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రం షూటింగ్ తాజాగా ముగిసింది. మేకర్స్ ఒక కూల్ వీడియోని షేర్ చేసారు. త్వరలోనే ట్రైలర్ రానుంది. ఇక సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. గీత గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ- దర్శకుడు పరశురామ్‌ల కలయికలో వస్తున్న రెండవ సినిమా ఇది. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుండగా, రష్మిక మందన్న అతిధి పాత్రలో కనిపించనుందనే టాక్ వినిపిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శ్రీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించారు.
It's a wrap for #FamilyStar ⭐
— Sri Venkateswara Creations (@SVC_official) March 16, 2024
Coming to cinemas near you with lots of love & entertainment on April 5th ❤️🔥
- https://t.co/DvMG50vDMU
Trailer Announcement soon 💥#FamilyStarOnApril5th @TheDeverakonda @Mrunal0801 @ParasuramPetla #KUMohanan @GopiSundarOffl @Singer_Karthik… pic.twitter.com/3njAzppZeW