మైత్రి సంస్థ‌ల కార్యాలయాల్లో ఐటీ సోదాలు

IT searches at the offices of Mythri companies. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కు చెందిన కార్యాలయాల్లో ఈ ఉదయం నుంచి ఐటీ సోదాలు జరుగుతున్నాయి.

By M.S.R  Published on  12 Dec 2022 4:30 PM IST
మైత్రి సంస్థ‌ల కార్యాలయాల్లో ఐటీ సోదాలు

ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కు చెందిన కార్యాలయాల్లో ఈ ఉదయం నుంచి ఐటీ సోదాలు జరుగుతున్నాయి. సంస్థ లావాదేవీల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. దాదాపు 15 చోట్ల ఏక కాలంలో సోదాలు జరుపుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సంక్రాంతికి రెండు భారీ చిత్రాలను బరిలోకి దింపుతోంది. చిరంజీవి నటిస్తున్న 'వాల్తేరు వీరయ్య', బాలకృష్ణ 'వీరసింహా రెడ్డి' సినిమాలను విడుదల చేస్తోంది. ఇప్పటి వరకు సర్కారువారి పాట, శ్రీమంతుడు, పుష్ప, రంగస్థలం జనతా గ్యారేజ్ వంటి హిట్ చిత్రాలను నిర్మించింది.

మైత్రి మూవీ మేకర్స్ సంస్థ యజమానులు నవీన్ ఎర్నేని, రవి శంకర్, మోహన్‌లపై ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో 'ఉస్తాద్ భగత్‌సింగ్' సినిమాకు ఇటీవలే పూజా కార్యక్రమాలు నిర్వహించింది. ఈ నిర్మాణ సంస్థ చేతిలో ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలున్నాయి. ఇక అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో మైత్రీ సంస్థ 'పుష్ప' సెకండ్ పార్ట్‌ను మరింత రిచ్‌గా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తోంది. వీరు నిర్మిస్తున్న ప్రాజెక్టులకు సంబంధించిన బడ్జెట్ లావాదేవీల్లో అవకతవకలు ఉన్నట్లుగా ఐటీ శాఖకు సమాచారం అందడంతో రైడ్స్ నిర్వహించినట్లు తెలుస్తోంది.


Next Story