మైసూర్‌లో రాఖీ సావంత్ భర్త ఆదిల్ ఖాన్ దురానీపై తాజాగా మరో ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. మైసూర్‌లోని వివి పురం పోలీస్ స్టేషన్‌లో ఐపిసి సెక్షన్ 376 కింద పోలీసులు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. ఆదిల్ ఇరాన్ యువతిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. రాఖీ సావంత్ పెట్టిన కేసులో ఆదిల్ ఇప్పటికే జైలులో ఉన్నాడు. ప్రస్తుతం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆదిల్‌పై ఇది రెండో ఎఫ్‌ఐఆర్.
మైసూర్‌లో సహజీవనం చేస్తున్నప్పుడు పెళ్లి సాకుతో ఆదిల్ తనపై అత్యాచారం చేశాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఐదు నెలల క్రితం తనను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేయగా.. అతను ఆదిల్ తిరస్కరించాడు. అంతేకాక ఆదిల్ చాలా మంది అమ్మాయిలతో ఇలాంటి సంబంధం కలిగి ఉన్నాడని ఆమె పేర్కొంది. ప్రైవేటు ఫోటోలు పంపి ఫిర్యాదు చేయవద్దని బెదిరించి బ్లాక్ మెయిల్ చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆదిల్ పై IPC 376, 417,420, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అంతకుముందు ఫిబ్రవరిలో రాఖీ మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుంది. తనను చిత్ర హింసలు పెట్టాడని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు.. ఆదిల్‌ను ఓషివారా పోలీస్ స్టేషన్‌లో విచారణ కోసం పిలిపించి ఆపై అరెస్టు చేశారు.