ట్రైనర్‌తో ఆమిర్ కూతురు ప్రేమాయణం!

Ira Khan dating her fitness coach Nupur Shikhare. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కుమారై ఐరా ఖాన్ ఇటీవ‌ల త‌రుచుగా వార్త‌ల్లో నిలుస్తోంది.

By Medi Samrat  Published on  25 Nov 2020 6:37 AM GMT
ట్రైనర్‌తో ఆమిర్ కూతురు ప్రేమాయణం!

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కుమారై ఐరా ఖాన్ ఇటీవ‌ల త‌రుచుగా వార్త‌ల్లో నిలుస్తోంది. తాజాగా అమ్మ‌డు ప్రేమ‌లో ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఈమె ప్రేమ వ్య‌వ‌హారం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఫిట్‌నెస్‌ ట్రైన‌ర్ నుపూర్ శిఖారెతో ఐరా ప్రేమ‌లో ప‌డిన‌ట్లు జాతీయ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. ఐరాఖాన్ గతంలో మిషాల్ కృపలానిని ప్రేమించింది. కానీ గత ఏడాది డిసెంబర్‌లో మిషాల్ కృపలానికి బ్రేకప్ చెప్పింది. మిషాల్‌తో ఆమె రెండేళ్లపాటు రిలేషన్‌షిప్ కొనసాగించింది. అయితే.. వారిద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో వీరిద్ద‌రూ గ‌తేడాది విడిపోయారు.

తాజాగా ఆమె ఆమిర్‌ఖాన్‌ ఫిట్నెస్ కోచ్‌తో ప్రేమ‌లో ప‌డిన‌ట్లు స‌మాచారం. గ‌త‌కొన్నేళ్లుగా ఆమిర్‌కు ఫిట్‌నెస్ ట్రైన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న నుపేర్ లాక్‌డౌన్ నుంచి ఐరాకు సైతం వ‌ర్కౌట్ల విష‌యంలో కోచ్‌గా మారారు. అయితే.. నుపూర్ వ్య‌క్తిత్వం న‌చ్చ‌డంతో ఐరా అత‌నితో ప్రేమ‌లో ప‌డింద‌ని.. కొన్ని నెల‌లుగా వీరిద్ద‌రూ డేటింగ్‌లో ఉన్నారంటూ ప్ర‌చారం సాగుతోంది.

వీళ్లిద్దరూ కలిసి ఇటీవల మహాబలేశ్వర్ లోని అమీర్ ఖాన్ ఫామ్ హౌస్ లో కొన్నిరోజుల పాటు గడిపారట. ఐరా తన ప్రేమవిషయాన్ని తల్లి రీనా దత్తాకు చెప్పినట్టు సమాచారం. ఇక వీరిద్ద‌రికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

ఇదిలా ఉంటే.. గ‌తంలో ఐరా.. మహిళలపై జరుగుతున్న లైంగికవేధింపులపై గళమెత్తారు. తాను 14 ఏళ్ల వయస్సులోనే లైంగిక వేధింపులకు గురయ్యానని మీడియాతో చెప్పారు. డిప్రెషన్‌పై కూడా ఆమె పలుమార్లు తన అభిప్రాయాన్ని చెప్పారు.
Next Story
Share it