ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌పై జరుగుతున్న దర్యాప్తుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణను వేగవంతం చేసింది. రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి లకు సమన్లు జారీ చేసింది. రానా దగ్గుబాటిని జూలై 23న, ప్రకాష్ రాజ్ జూలై 30న, విజయ్ దేవరకొండ ఆగస్టు 6న, మంచు లక్ష్మి ఆగస్టు 13న హాజరు కావాలని ఆదేశించారు. 29 మంది నటులు, ఇన్ఫ్లుయెన్సర్లు, కంటెంట్ సృష్టికర్తలపై మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR) నమోదు చేసిన తర్వాత ఈ సమన్లు జారీ అయ్యాయి.
ఇందులో రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, ప్రణీత, మంచు లక్ష్మి, శ్రీముఖి, శ్యామల లాంటి సినీ ప్రముఖులు ఉన్నారు. హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, ‘లోకల్ బాయ్ నాని’ తో సహా పలువురు సోషల్ మీడియా వ్యక్తులు, యూట్యూబర్‌లు కూడా ఉన్నారు.