అతడెవరో చూపించిన‌ ఇలియానా..!

Ileana finally reveals her boyfriend on social media. నటి ఇలియానా డి క్రజ్ ఎట్టకేలకు తన బాయ్‌ఫ్రెండ్ గురించి అభిమానులకు తెలిపింది.

By Medi Samrat
Published on : 17 July 2023 5:00 PM IST

అతడెవరో చూపించిన‌ ఇలియానా..!

నటి ఇలియానా డి క్రజ్ ఎట్టకేలకు తన బాయ్‌ఫ్రెండ్ గురించి అభిమానులకు తెలిపింది. ఆమె గర్భంతో ఉందన్న విషయం గురించి తెలియగానే.. ఇలియానీ బాయ్ ఫ్రెండ్ గురించి చర్చ కొనసాగింది. ఆమె గర్భం దాల్చినప్పటి నుండి ఆమె ప్రియుడికి సంబంధించి అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. తాజాగా ఇలియానా తన కాబోయే భర్త ఫోటోను పంచుకుంది. తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేసింది.


ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో తన జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి ముఖాన్ని రివీల్ చేశారు. బ్లాక్ షర్ట్ ధరించి, గడ్డంతో వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫొటోలను షేర్ చేశారు. అయితే, ఆయనకు సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు. గతంలోనూ తన లైఫ్‌పార్ట్‌నర్‌కు సంబంధించిన ఫొటోలను షేర్ చేసినప్పటికీ ముఖాన్ని మాత్రం దాచిపెట్టారు. తన బాయ్‌ఫ్రెండ్‌తో పోజులిచ్చిన ఇలియానా ఇన్‌స్టాగ్రామ్‌లో వరుసగా ఫోటోలను షేర్ చేసింది. ఈ జంట రొమాంటిక్ ఔటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ‘డేట్ నైట్’లో ఇలియానా సెల్ఫీలు దిగింది. ఏప్రిల్ 18న, ఇలియానా డి'క్రూజ్ తన గర్భాన్ని గురించి సోషల్ మీడియాలో 'మామా' అనే పదం ఉన్న లాకెట్టుతో ప్రకటించింది.


Next Story