'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమా నిర్మాతలకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా లీగల్ నోటీసులు పంపారు. 'ఓథా రుబాయుమ్ తరేన్', 'ఇలమై ఇధో ఇధో' , 'ఎన్ జోడి మంజ కురువి' పాటలను ఉపయోగించినందుకు లీగల్ నోటీసులు పంపారు. ఆయన రూ.5 కోట్ల భారీ పరిహారం డిమాండ్ చేశారు. ఇళయరాజా కంపోజ్ చేసిన పలు సాంగ్స్ ను ఎలాంటి అనుమతులు లేకుండా సినిమాలో ఉపయోగించారంటూ ఆయన టీమ్ నోటీసులు పంపించింది. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాలో తనకు సంబంధించిన పాటల వెర్షన్‌ను వెంటనే తొలగించాలని, లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పాలని ఇళయరాజా డిమాండ్ చేశారు.
తన పాటల వాడకంపై ఇళయరాజా ఒక చిత్రానికి నోటీసులు పంపడం ఇదే మొదటిసారి కాదు. 2024లో, 'గుణ'లోని 'కన్మణి అన్బోడు' పాటను అనధికారికంగా ఉపయోగించినందుకు ఆయన మలయాళ బ్లాక్‌బస్టర్ 'మంజుమ్మెల్ బాయ్స్' నిర్మాతల నుండి రూ. 2 కోట్లు డిమాండ్ చేశారు. నిర్మాతలు రూ. 60 లక్షలు చెల్లించిన తర్వాత ఈ విషయం పరిష్కారమైంది.