ఆ వార్తలను ఖండించిన ఇళయరాజా

తమిళనాడులోని ఓ ఆలయంలో తన పట్ల అనుచితంగా ప్రవర్తించారనే వదంతులను సంగీత మాస్ట్రో ఇళయరాజా ఖండించారు.

By Medi Samrat  Published on  16 Dec 2024 6:45 PM IST
ఆ వార్తలను ఖండించిన ఇళయరాజా

తమిళనాడులోని ఓ ఆలయంలో తన పట్ల అనుచితంగా ప్రవర్తించారనే వదంతులను సంగీత మాస్ట్రో ఇళయరాజా ఖండించారు. తనకు అవమానం జరిగిందంటూ కొందరు వ్యక్తులు పుకార్లను ప్రచారం చేస్తున్నారని, ఈ పుకార్లను నమ్మవద్దని ఆయన అభిమానులు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇళయరాజా ఆలయాన్ని సందర్శించినప్పుడు ప్రవేశానికి అనుమతించకుండా అవమానించారని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది. మాస్ట్రోను పూజారులు అవమానించారని పలువురు పోస్టులను పంచుకున్నారు. ఇళయరాజా వీటిని ఖండించడంతో ఎలాంటి తప్పు జరగలేదని, అది కేవలం రూమర్ మాత్రమేనని తేలిపోయింది. ఈ ఘటనకు సంబంధించి ఇళయరాజా తన అధికారిక ఎక్స్ హ్యాండిల్‌లో ట్వీట్ చేశారు. ఈ నిరాధారమైన పుకార్లకు సంగీత దర్శకుడే స్వస్తి పలికినందుకు నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Next Story