క్షమాపణలు చెప్పేదే లేదంటున్న మన్సూర్
త్రిషపై నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.
By Medi Samrat Published on 21 Nov 2023 9:30 PM ISTత్రిషపై నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. 'లియో'సినిమాలో మన్సూర్ కనిపించారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది. రేప్ సన్నివేశం ఉంటుందని తాను భావించానని.. కానీ త్రిషతో కలిసి నటించలేకపోయానని అన్నాడు.
ఇక నవంబర్ 21న చెన్నైలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన ఆయన తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పబోనని స్పష్టం చేశాడు. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేది లేదని మన్సూర్ అలీ ఖాన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు. తానెటువంటీ అసభ్యకరమైన వ్యాఖ్యలు చెయ్యలేదని, సరదాగా అన్న మాటలు పట్టుకొని తనని త్రిషతో సహా అందరూ టార్గెట్ చేశారన్నాడు మన్సూర్. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాపణ కూడా చెప్పేది లేదని తేల్చేసాడు. మీడియాలో తన ఫోటోలు మంచివి వాడలేదని, అంతకంటే మంచి ఫోటోలు నావి దొరకలేదా అంటూ ఆ ప్రెస్ మీట్ లో మీడియావాళ్లకి సూచించాడు. తాను ఏమీ తప్పు మాట్లాడలేదని, సినిమాలో రేప్ సన్నివేశాలు గురించి మాత్రమే మాట్లాడానన్నాడు. అతని వ్యాఖ్యల తర్వాత, నడిగర్ సంఘం అతనపై తాత్కాలికంగా నిషేధం విధించింది.