ఆసక్తిరేపుతోన్న 'హంట్' టీజర్
Hunt movie teaser released. రిజల్ట్స్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు
By అంజి Published on 3 Oct 2022 2:16 PM ISTరిజల్ట్స్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు హీరో సుధీర్‌బాబు. అయితే సుధీర్ బాబు సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తున్న బాక్సాఫీస్ దగ్గర మాత్రం మంచి కలెక్షన్లు రావడం లేదు. ఇటీవల సుధీర్‌బాబు నటించిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' మూవీ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా.. బ్రేక్ ఈవెన్‌ను మాత్రం సాధించలేదు. ప్రస్తుతం ఈ హీరో లేటెస్ట్‌గా నటిస్తున్న సినిమా 'హంట్'. ఈ సినిమాతో మహేష్ సూరపనేని దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మరోవైపు ఈ మూవీ సుధీర్‌బాబు కెరీర్‌లోనే ఎక్కువ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మూవీ. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్‌లు ఆసక్తిని పెంచాయి.
తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ మూవీలో సుధీర్‌బాబు గజిని తరహాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సుధీర్ డ్యుయెల్ రోల్‌లో నటిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ ఈ మూవీ తెరకెక్కుతోంది. సుధీర్ బాబు రెండోసారి ఇంటెన్సివ్ పోలీస్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అతను నాని చిత్రం 'వి'లో తన మొదటి పోలీసు పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి ఆనంద ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందించారు. అరుల్ విన్సెంట్ సినిమాటోగ్రాఫర్, ప్రవీణ్ పూడి ఎడిటర్. ఈ సినిమా విడుదల తేదీని ఇంకా ఖరారు చేయలేదు.