‘వార్ 2’ సినిమా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియా స్పై థ్రిల్లర్. దక్షిణాదికి చెందిన జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఆగస్టు 14న విడుదల కానున్న ఈ చిత్రం YRF స్పై యూనివర్స్‌లో భాగం. భారతీయ సినిమాలో అత్యంత ఖరీదైన ప్రాజెక్టులలో ఒకటి. ఈ కలయిక ఆసక్తిని రేకెత్తించినప్పటికీ ఇన్నాళ్లూ చిత్ర యూనిట్ చాలా సైలెంట్ గా ఉంది.
మరొక పాన్-ఇండియా చిత్రం ‘కూలీ’ ఇప్పటికే అదే తేదీకి విడుదలను ప్రకటించింది. ‘కూలీ’ నుండి ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే అన్ని ప్లాట్‌ఫామ్‌లలో సందడి చేస్తూ ఉండడంతో.. ‘వార్ 2’ బృందం ఇప్పుడు ముందుకు వచ్చింది. మే 20న, ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘వార్ 2’ టీజర్‌ను ఆవిష్కరించాలని మేకర్స్ యోచిస్తున్నారు. ప్రజల అంచనాలను అందుకోవడంలో ఈ టీజర్ కీలక పాత్ర పోషిస్తుంది. టీజర్‌లో ఎన్టీఆర్ పాత్ర ఆకట్టుకుంటే, అది భారీ ఓపెనింగ్‌స్ రాబట్టడం ఖాయం. ఇప్పుడు అందరి దృష్టి టీజర్ పైనే ఉంది.