సినీ, టీవీ కార్మికులకు హృతిక్ సాయం

Hrithik Roshan donates Rs. 20 lakh to CINTAA amid the second wave of Covid-19. క‌రోనా విజృంభ‌ణ‌ నేప‌థ్యంలో సినిమా షూటింగ్స్ అన్నీ స్తంభించిన సంగ‌తి తెలిసిందే.

By Medi Samrat  Published on  4 Jun 2021 3:37 AM GMT
సినీ, టీవీ కార్మికులకు హృతిక్ సాయం

క‌రోనా విజృంభ‌ణ‌ నేప‌థ్యంలో సినిమా షూటింగ్స్ అన్నీ స్తంభించిన సంగ‌తి తెలిసిందే. దీంతో సినీ కార్మికుల జీవ‌నం దుర్భ‌రంగా మారింది. కార్మికుల ప‌రిస్థితి తెలుసుకున్న కొంత‌మంది హీరోలు, ప్ర‌ముఖులు వారికి అండగా నిలుస్తూ నిత్యావ‌స‌ర స‌రుకులు అందిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్ కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న సినీ టీవీ కార్మికులను ఆదుకునేందుకు ముందుకు వ‌చ్చారు.

సినీ, టీవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌కు హృతిక్ రోష‌న్ రూ. 20 లక్షల ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర వస్తువుల కిట్లు అందించారు. హృతిక్ సాయం విషయాన్ని సినీ, టీవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ సంస్థ ప్రధాన కార్యదర్శి అమిత్‌ బెహల్ తెలిపారు. హృతిక్ అందించిన సాయాన్ని 5 వేల మంది స‌భ్యుల‌కు వ్యాక్సిన్‌తో పాటు నిత్యావ‌స‌రాల కోసం ఉప‌యోగిస్తామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. గ‌త ఏడాది క‌రోనా స‌మ‌యంలోను హృతిక్ పాతిక ల‌క్ష‌ల రూపాయ‌ల సాయం చేశారు.


Next Story