హృతిక్ రోషన్ తన రిలేషన్ షిప్ ను బహిరంగంగా ప్రకటించేసినట్లేనా..?

Hrithik Roshan And Rumoured Girlfriend Saba Azad Make It Airport-Official. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, సబా ఆజాద్ మధ్య స్నేహం ఉందని గత కొద్దిరోజులుగా ప్రచారం సాగుతోంది

By Medi Samrat  Published on  5 April 2022 2:30 PM GMT
హృతిక్ రోషన్ తన రిలేషన్ షిప్ ను బహిరంగంగా ప్రకటించేసినట్లేనా..?

బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, సబా ఆజాద్ మధ్య స్నేహం ఉందని గత కొద్దిరోజులుగా ప్రచారం సాగుతోంది. వారి మధ్య ఉన్నది స్నేహం మాత్రమే కాదని.. అంతకు మించి అనే ప్రచారం కూడా సాగింది. కొద్దిరోజుల కిందట డిన్నర్ సమయంలో జంటగా కనిపించిన వీరిద్దరూ.. మంగళవారం ముంబై విమానాశ్రయంలో కనిపించారు. వారు ఒకరి చేయి మరొకరు పట్టుకుని తమ రిలేషన్ షిప్ కు సంబంధించిన అఫీషియల్ క్లారిఫికేషన్ ఇచ్చినట్లేనని బాలీవుడ్ మీడియా చెబుతోంది.

ఈ జంట విమానాశ్రయం నుండి బయటకు వస్తుండగా.. ఫోటోగ్రాఫర్లు చాలా బిజీగా కనిపించారు. ఆమె టాప్, ప్యాంట్‌లో కనిపించగా.. హృతిక్ తెల్లటి టీ-షర్ట్, జీన్స్, క్యాప్‌ ధరించి ఉన్నాడు. ఫిబ్రవరిలో హృతిక్ రోషన్ ఒక మహిళతో డిన్నర్‌లో కనిపించినప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అయింది. ఆమెను అభిమానులు సబా ఆజాద్, నటి- గాయనిగా గుర్తించారు. సోషల్ మీడియాలో సబా- హృతిక్‌ల సందడి కూడా కొనసాగుతూ వస్తోంది.

సబా ఆజాద్ ఆదివారం నాడు లంచ్ ను హృతిక్ రోషన్ కుటుంబంతో కలిచి చేసింది. ఈ ఫోటోను హృతిక్ మామ రాజేష్ రోషన్ షేర్ చేశారు. సబా హృతిక్ మాజీ భార్య సుస్సానే ఖాన్‌తో కూడా మంచి స్నేహం కలిగి ఉంది. వారిద్దరి మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో సంభాషణలు కూడా ఉన్నాయి.
Next Story
Share it