ప్రముఖ హాలీవుడ్ సినిమా దర్శకుడు, నటుడు, చిత్ర నిర్మాత పీటర్ బొగ్డనోవిచ్ కన్నుమూశారు. బొగ్డనోవిచ్ లాస్ ఏంజిల్స్‌లోని తన ఇంటిలో గురువారం తెల్లవారుజామున మరణించినట్లు అతని కుమార్తె ఆంటోనియా బొగ్డనోవిచ్ తెలిపారు. అతను సహజంగా మరణించాడని ఆమె చెప్పింది. బొగ్డనోవిచ్ వయసు 82. సినీఫైల్, ది లాస్ట్ పిక్చర్ షో, పేపర్ మూన్ వంటి సినిమాలతో పీటర్ తన కెరీర్‌ను ప్రారంభించాడు. 1939లో న్యూయార్క్‌లోని కింగ్‌స్టన్‌లో జన్మించిన బొగ్డనోవిచ్, నటుడిగా, ఫిల్మ్ జర్నలిస్టుగా మరియు విమర్శకుడిగా, మ్యూజియం ఆఫ్ మోడరన్ ఆర్ట్‌లో ఫిల్మ్ ప్రోగ్రామర్‌గా పని చేశాడు. పీటర్ మొదటగా నటి లూయీస్ స్టాట్టెన్ పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత హాలీవుడ్ ప్రొడ్యూసర్ పొల్లీ ప్లాట్‌ను పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ రెండు పెళ్లిలు కూడా డైవర్స్‌తో విడిపోయాయి.
చివరకు ది లాస్ట్ పిక్చర్ హీరోయిన్ సైబిల్ షెఫర్డ్‌ను పీటర్ వివాహమాడాడు. పీటర్‌కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆస్కార్‌కు నామినేట్ చేయబడిన చిత్రనిర్మాతలలో అతను తన సినిమాలకు భారీ ప్రజాదరణ పొందాడు. వాట్స్ అప్, డాక్?, పేపర్ మూన్, ది సోప్రానోస్, ది అదర్ సైడ్ ఆఫ్ ది విండ్, మరెన్నో చిత్రాలకు అతను బాగా పేరు పొందాడు. పీటర్ బొగ్డనోవిచ్‌ను మృతిపై ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అమెరికన్ కళాకారుడు పీటర్ బోగ్డనోవిచ్ మరణించినట్లు ఇంటర్నెట్‌లో వార్తలు వెలువడిన క్షణంలో, జెఫ్ బ్రిడ్జెస్, పాల్ ఫీగ్, రాబ్ లోవ్, గ్లెన్ కారన్, బెన్ మాన్కీవిచ్, ఫ్రాన్సిస్ ఫిషర్, జేమ్స్ ఉర్బానియాక్, ఇతరులు అనేక మంది ప్రముఖులు ట్విట్టర్‌లోకి వెళ్లి సంతాపం తెలిపారు.