హిట్-3, రెట్రో సెన్సార్ రిపోర్టులు ఇవే..!

సూర్య, కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా 'రెట్రో'. ఈ సినిమా మే 1, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

By Medi Samrat
Published on : 26 April 2025 2:30 PM IST

హిట్-3, రెట్రో సెన్సార్ రిపోర్టులు ఇవే..!

సూర్య, కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా 'రెట్రో'. ఈ సినిమా మే 1, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రోమోలు, పోస్టర్లతో ప్రేక్షకులలో మంచి హైప్ ను తెప్పించాయి. రెట్రో సినిమాకు సంబంధించి తెలుగులో సెన్సార్ ఫార్మాలిటీలు పూర్తయ్యాయి. రెట్రో తెలుగు వెర్షన్ UA (16+) సర్టిఫికేట్ పొందింది. సినిమా రన్‌టైమ్ 168 నిమిషాల 30 సెకన్లు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ 26న జరగనుంది. విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరవుతారు. విజయ్ కింగ్‌డమ్ సినిమాను నిర్మిస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ రెట్రో చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తోంది.

నాని హీరోగా నటించిన 'హిట్ 3' మరో 5 రోజుల్లో థియేటర్లలో విడుదలవ్వనుంది. ఈ చిత్రం థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపిస్తుందని భావిస్తున్నారు. ఏప్రిల్‌లో థియేటర్ యజమానులను పలు సినిమాలు నిరాశపరచడంతో, అందరూ ఈ చిత్రంపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇక హిట్ 3 A సర్టిఫికెట్‌తో సెన్సార్ చేశారు. సినిమా రన్‌టైమ్ 157 నిమిషాలు, అంటే దాదాపు 2 గంటల 40 నిమిషాలు. ఈ చిత్రం ప్రారంభం నుండే ఇంటెన్స్ మోడ్‌లో ఉంటుందని సెన్సార్ టాక్.

Next Story