అంతర్జాతీయ అవార్డును దక్కించుకున్న 'హాయ్ నాన్న'

నాని-మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన 'హాయ్ నాన్న' సినిమా గత సంవత్సరం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది

By Medi Samrat  Published on  6 April 2024 9:45 PM IST
అంతర్జాతీయ అవార్డును దక్కించుకున్న హాయ్ నాన్న

నాని-మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన 'హాయ్ నాన్న' సినిమా గత సంవత్సరం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమా పలు ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకుంటూ ఉంది. ఈ చిత్రం యొక్క ఆంగ్ల వెర్షన్ 'హాయ్ డాడ్' ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా ప్రతిష్టాత్మక అవార్డును అందుకుంది. దసరా తర్వాత 2023లో నాని సాధించిన 2వ హిట్‌ సినిమాగా హాయ్ నాన్న నిలిచింది. ఈ చిత్రం నాని నటనకు, ఎమోషనల్ నేరేషన్ కు ప్రశంసలు దక్కించుకుంది. ఈ చిత్రం మరిన్ని అవార్డులను సొంతం చేసుకోబోతోందని అభిమానులు ఆశిస్తూ ఉన్నారు.

దర్శకుడు శౌర్యువ్ ఈ సినిమాను హార్ట్ టచింగ్ ఎమోషన్స్‌తో పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించాడు. నాని ఈ చిత్రంలో అత్యుత్తమ ప్రదర్శనను ఇచ్చాడు. మృణాల్ ఠాకూర్ కూడా మరోసారి మెప్పించింది. నాని కూతురుగా కియారా ఖన్నా అద్భుతమైన నటన కనబరిచింది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను నిర్మించగా.. హేషమ్ అబ్దుల్ వహాబ్ సూపర్ సాంగ్స్ ను అందించాడు. హాయ్ నాన్నా.. ఓటీటీలో మరింత మందికి చేరువైంది. ఈ చిత్రం జనవరిలో నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో అందుబాటులో ఉంది.

Next Story