హాయ్ నాన్న ట్రైలర్ వచ్చేస్తోంది

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘హాయ్ నాన్న’. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా, శౌర్యువ్ తెరకెక్కిస్తున్న..

By Medi Samrat  Published on  21 Nov 2023 1:15 PM GMT
హాయ్ నాన్న ట్రైలర్ వచ్చేస్తోంది

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘హాయ్ నాన్న’. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా, శౌర్యువ్ తెరకెక్కిస్తున్న ఈ ఎమోషనల్ డ్రామా డిసెంబర్ 7న పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, సాంగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను ఈ నవంబర్ 24న రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు మేకర్స్.

'హాయ్ నాన్న'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను మరింత పెంచడానికి నవంబర్ 24 న ట్రైలర్‌ను విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచుతుందనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రానికి మహీషం అబ్దుల్ వహద్ సంగీతం అందించాడు. ఇంతకు ముందు ‘జెర్సీ’ మూవీలో ఫాదర్ సెంటిమెంట్‌ని పండించిన నాని.. ఈ ‘హాయ్ నాన్న’ మూవీలో ఎంతమేరకు ఆకట్టుకుంటాడో చూడాలి. హాయ్ నాన్న సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో విడుదల కానుంది.

Next Story