'హాయ్ నాన్న' సెన్సార్ రిపోర్ట్.. రన్ టైమ్ ఇదే.!

'హాయ్ నాన్న' సినిమా సెన్సార్ రిపోర్ట్, రన్ టైమ్ వివరాలు వచ్చేశాయి. నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం హాయ్ నాన్న విడుదల

By Medi Samrat  Published on  26 Nov 2023 3:41 PM IST
హాయ్ నాన్న సెన్సార్ రిపోర్ట్.. రన్ టైమ్ ఇదే.!

నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం హాయ్ నాన్న విడుదల తేదీ దగ్గర పడుతూ ఉంది. 'హాయ్ నాన్న' సినిమా సెన్సార్ రిపోర్ట్, రన్ టైమ్ వివరాలు వచ్చేశాయి. ఈ సినిమాకు క్లీన్ 'యు' సర్టిఫికేట్‌ జారీ చేశారు. సినిమా రన్‌టైమ్ 155 నిమిషాలు. డిసెంబర్ 7న సినిమా విడుదలవుతోంది. పాటలు, ప్రోమోలకు మంచి స్పందన వచ్చింది. ఇక ముఖ్యంగా ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచేసింది. ఇక నాని నాన్‌స్టాప్ ఇంటర్వ్యూలతో తెలుగులో సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. డిసెంబర్ 6న సినిమా పెయిడ్ ప్రీమియర్లను ప్లాన్ చేస్తున్నారు. సినిమాపై నాని అండ్ టీమ్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

హాయ్ నాన్నాపై సెన్సార్ బోర్డ్ ఫీడ్‌బ్యాక్ కూడా బాగా ఉందని తెలుస్తోంది. కొన్ని ప్రధాన సన్నివేశాలు సెన్సార్ సభ్యులను కంటతడి పెట్టించాయని కూడా టాక్ వచ్చింది. థియేటర్లలో సినిమా ప్రేక్షకులను బాగా మెప్పిస్తుంది. నాని, మృణాల్ ఠాకూర్ కాకుండా ఈ సినిమాలో శ్రుతి హాసన్, ప్రియదర్శి, జయరామ్ వంటి ప్రముఖ నటులు ఉన్నారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీత దర్శకుడు. శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజిలో విడుదల కాబోతోంది.

Next Story