హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో అగ్ని ప్ర‌మాదం.!

Heroine Rakul Preet Singh's house on fire. ముంబైలోని హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆమె నివాసం ఉండే భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

By అంజి  Published on  21 Nov 2021 2:52 AM GMT
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో అగ్ని ప్ర‌మాదం.!

ముంబైలోని హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆమె నివాసం ఉండే భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అపార్ట్‌మెంట్‌లోని 12వ అంతస్తులో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా అగ్ని ప్రమాదం సంభవించడానికి గల కారణామాలు మాత్రం ఇంకా తెలియలేదు. ప్రస్తుతం రకుల్‌ ప్రీత్‌సింగ్‌ సినిమా షూటింగ్‌ కోసం విదేశాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

టాలీవుడ్‌ అగ్ర హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్న రకుల్‌.. తెలుగులో 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' సినిమాతో ఫస్ట్‌ హిట్‌ అందుకున్నారు. ఆ తర్వాత పలు సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించారు. బాలీవుడ్‌, టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌ సినిమాల్లోనూ రకుల్‌ సినిమాలు చేస్తోంది. ఇటీవల కొండపొలం సినిమాలో నటించి అందరిని ఆకట్టుకుంది. కొన్ని రోజుల క్రితం రకుల్‌ తన ప్రేమ విషయాన్ని కూడా తెలిపింది. ప్రొడ్యూసర్‌ జాకీ భగ్నానీని త్వరలోనే మ్యారేజ్‌ చేసుకోబుతున్నట్లు ఈ భామ చెప్పింది.

Next Story
Share it