ఆ రెండు అరుదైన రికార్డులూ ప్రభాస్‌వే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన 'కల్కి 2898 ఏడీ' బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే.
By అంజి Published on 18 July 2024 5:55 AM GMTఆ రెండు అరుదైన రికార్డులూ ప్రభాస్‌వే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన 'కల్కి 2898 ఏడీ' బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా రూ. వెయ్యి కోట్లు వసూలు చేసినట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. అంతేకాదు.. వసూళ్ల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉన్నట్టు తెలిపింది. నార్త్ అమెరికాలో 17 మిలియన్ డాలర్లు వసూలు చేసిన చిత్రంగానూ రికార్డును బద్దలు కొట్టింది కల్కి. ఒక దక్షిణాది కథనాయకుల్లో రూ.1000 కోట్లకుపైగా వసూళ్లను రెండుసార్లు రాబట్టిన తొలి హీరో ప్రభాస్ కావడం గమనార్హం.
గతంలో రాజమౌళి దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్ నటించిన 'బహుబలి: ది కన్‌క్లూజన్' ఏకంగా రూ.1800 కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా రూ.వెయ్యి కోట్లకుపైగా వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల్లో 'కల్కి2898 ఏడీ' 7వ చిత్రంగా నిలిచింది. కల్కి.. కన్నా ఈ రికార్డును సాధించిన భారతీయ చిత్రాలు ఆరు ఉండగా.. 'కల్కి' నెంబర్ 7. ఇక నార్త్ అమెరికాలోనూ అరుదైన ఫిట్‌ను కల్కి సొంతం చేసుకుంది. 16.2 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.
నాన్ బహుబలి రికార్డులు బద్దలు కొట్టింది. బుక్ మై షోలో కోటికిపైగా టికెట్ల విక్రయమైన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ ట్రెండ్ ఇలా కొనసాగితే మరో వంద, రెండొందల కోట్లు 'కల్కి' సులభంగా రాబట్టే అవకాశం ఉంది. బహుబలి తర్వాత ప్రభాస్ నటించిన చిత్రాలు మిశ్రమ స్పందనలు అందుకున్న నేపథ్యంలో వరుసగా సలార్, కల్కి రెండూ విజయం సాధించడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.