రీ రిలీజ్‌కు సిద్ధమైన పవన్ సినిమాలు

త్వరలో పవన్ కళ్యాణ్ నటించిన రెండు సినిమాలు రీ రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. తొలిప్రేమ సినిమా, గుడుంబా శంకర్ సినిమాలు థియేటర్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 May 2023 4:00 PM IST
Pawan Kalyan, movies re-release, Tollywood

రీ రిలీజ్‌కు సిద్ధమైన పవన్ సినిమాలు 

త్వరలో పవన్ కళ్యాణ్ నటించిన రెండు సినిమాలు రీ రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. తొలిప్రేమ సినిమా, గుడుంబా శంకర్ సినిమాలు థియేటర్ లలో సందడి చేయనున్నాయి. 1998 లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా తొలిప్రేమ త్వరలో రీరిలీజ్ కాబోతోంది. క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో 1998లో రిలీజ్ అయింది. తెలుగులో వచ్చిన బెస్ట్ లవ్ స్టోరీలలో ఈ సినిమా కూడా ఒకటి. తొలి ప్రేమ సినిమాను జూన్ 30న రీ రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. తొలిప్రేమ రిలీజై ఇర‌వై ఐదేళ్లు గ‌డిచినా ఈ సినిమాపై క్రేజ్ త‌గ్గ‌లేదు. ఆ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొనే ఈ సినిమాను రీ రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

4కే టెక్నాల‌జీలో తొలిప్రేమ‌ను రీ రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవ‌ర్‌సీస్‌లో భారీగా రిలీజ్ చేయనున్నారు. గుడుంబా శంకర్ సినిమా కూడా రీరిలీజ్ చేయనున్నారు. అప్పట్లో ఈ సినిమా యావరేజ్ గా ఆడింది. వీరశంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు రీరిలీజ్ అవుతోందని తెలుస్తోంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా సాంగ్స్ ఆల్ టైమ్ హిట్స్ గా నిలిచాయి. మీరాజాస్మిన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా త్వరలోనే రీరిలీజ్ అవ్వనుంది. దాంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. త్వరలోనే ఈ సినిమా రీరిలీజ్ పై క్లారిటీ రానుంది.

Next Story