ఒక వ్యక్తిని నిందించడం కరెక్ట్ కాదు

అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై నటుడు నాని స్పందించారు. సినిమా వాళ్లకు సంబంధించిన ఏ విషయంలోనైనా ప్రభుత్వ అధికారులు, మీడియా చూపించే ఉత్సాహం సాధారణ పౌరులపై కూడా ఉండాలని కోరుకుంటున్నానని నాని అన్నారు.

By Medi Samrat  Published on  13 Dec 2024 6:51 PM IST
ఒక వ్యక్తిని నిందించడం కరెక్ట్ కాదు

అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై నటుడు నాని స్పందించారు. సినిమా వాళ్లకు సంబంధించిన ఏ విషయంలోనైనా ప్రభుత్వ అధికారులు, మీడియా చూపించే ఉత్సాహం సాధారణ పౌరులపై కూడా ఉండాలని కోరుకుంటున్నానని నాని అన్నారు. మనం మంచి సమాజంలో జీవించాలి.. అదొక దురదృష్టకర, హృదయ విదారక ఘటన అని అన్నారు. దీని నుంచి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవాలని, ఇకపై మరిన్ని జాగ్రత్తలు పాటించి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక్కడ మనందరి తప్పు ఉంది. ఒక వ్యక్తిని నిందించడం కరెక్ట్‌ కాదని నాని పోస్టు పెట్టారు.

అల్లు అర్జున్‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. చిక్కడపల్లిలో నమోదైన కేసును కొట్టివేయాలంటూ అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు జరిగాయి. క్వాష్ పిటిషన్ అత్యవసరమేమీ కాదని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో క్వాష్ పిటిషన్‌లోనే మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అల్లు అర్జున్ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి హైకోర్టును కోరారు. సుదీర్ఘ వాదనల అనంతరం అల్లు అర్జున్‌కు హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జైలు సూపరింటెండెంట్‌‌‌కు రూ.50 వేల సొంత పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టును ఆశ్రయించాలని సూచించింది. ఈ కేసులో సంధ్యా థియేటర్ యాజమాన్యానికి కూడా ఇదే తీర్పు వర్తిస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. అనంతరం క్వాష్ పిటిషన్ పై విచారణను రెండు వారాలకు వాయిదా వేసిన హైకోర్టు... మధ్యంతర బెయిల్ పై విచారణను జనవరి 21కి వాయిదా వేసింది.

Next Story