వైరల్ అవుతున్న నాగశౌర్య వీడియో.. నిజా నిజాలేమిటో..?

Hero Naga Shaurya Video Goes Viral . టాలీవుడ్ యంగ్‌ హీరో నాగశౌర్య కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది

By Medi Samrat  Published on  28 Feb 2023 4:27 PM IST
వైరల్ అవుతున్న నాగశౌర్య వీడియో.. నిజా నిజాలేమిటో..?

టాలీవుడ్ యంగ్‌ హీరో నాగశౌర్య కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. తాజాగా ఓ యువకుడితో రోడ్డు మీద గొడవపడ్డాడు. ఓ అబ్బాయి మరో అమ్మాయిని రోడ్డు మీద కొడుతున్నాడని, కారు ఆపి ఆమెకు సారీ చెప్పాలని ఆ యువకుడితో గొడవకు దిగాడు. ఆ అమ్మాయి తన గర్ల్‌ఫ్రెండ్‌ అని ఆ యువకుడు చెబుతూ ఉన్నా.. ఎంత గర్ల్ ఫ్రెండ్ అయితే మాత్రం కొడతావా అంటూ ఆ అమ్మాయికి సారీ చెప్పాలని గొడవపడ్డాడు మన హీరో. చేయిని లాగి మరీ సారి చెప్పమని కోరుతున్న వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

నాగశౌర్య ప్రస్తుతం ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా చేస్తున్నాడు. శ్రీనివాస్‌ అవసరాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మాళ‌వికా నాయ‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. సినిమా టీజర్‌ ఆకట్టుకుంటూ ఉంది.


Next Story