మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్‌ను కలిసిన హీరో

Hero Indrasena Meet Minister Gangula Kamalakar. సినీ హీరో ఇంద్రసేన ఈరోజు తన కొత్త సినిమా ‘శాసనసభ’ ట్రైలర్ లాంచ్ కు రావాల్సిందిగా రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్

By Medi Samrat  Published on  25 Nov 2022 1:11 PM GMT
మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్‌ను కలిసిన హీరో

సినీ హీరో ఇంద్రసేన ఈరోజు తన కొత్త సినిమా 'శాసనసభ' ట్రైలర్ లాంచ్ కు రావాల్సిందిగా రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్రను హైదరాబాద్ లో కలిసి ఆహ్వానించారు. ఈ నెల 27న మధ్యాహ్నం బంజారాహిల్స్ రాడిషన్ బ్లూ హోటల్లో నిర్వహించే ట్రైలర్ లాంచ్ వేడుకలలో సినీరంగానికి చెందిన ప్రముఖులు నటకిరీటి రాజేంద్రప్రసాద్, 7/G ఫేమ్ సోనీ అగర్వాల్ తదితరులతో పాటు రాజకీయ రంగ ప్రముఖులు, ఏపీ మంత్రి రోజా, ఎమ్మెల్యే డా. గాదరి కిషోర్ కుమార్ తదితరులు హాజరవుతున్నారని హీరో ఇంద్రసేన తెలిపారు. గతంలో సూపర్ స్కెచ్, పుత్రుడు వంటి విజయవంతమైన చిత్రాలలో నటించాడు ఇంద్రసేన. 'శాసనసభ' సినిమాకు నిర్మాత తులసిరామ్ సప్పాని, షణ్ముఖ్ సప్పాని, డైరెక్టర్ వేణు మదికంటితో పాటు ప్రతిష్టాత్మక కేజీఎఫ్ చిత్ర సంగీత దర్శకుడు రవి బసూర్ సంగీతం అందించడం విశేషం.


Next Story
Share it