కొరియోగ్రాఫ‌ర్ శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ కు హీరో ధ‌నుష్ సాయం

Hero Dhanush helped choreographer Shiva Shankar.ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ కొద్ది రోజుల క్రితం క‌రోనా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Nov 2021 9:12 AM GMT
కొరియోగ్రాఫ‌ర్ శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ కు హీరో ధ‌నుష్ సాయం

ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ కొద్ది రోజుల క్రితం క‌రోనా బారిన ప‌డ‌గా.. హైద‌రాబాద్‌లోని ఏఐజీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. మాస్ట‌ర్ చికిత్సకు అయ్యే ఖ‌ర్చును ఆయ‌న కుటుంబం భ‌రించ‌లేని స్థితిలో ఉంది. దాత‌ల సాయం కోసం వారు ఎదురుచూస్తున్నారు. ఈ విష‌యాన్ని తెలుసుకున్న బాలీవుడ్ న‌టుడు సోనుసూద్.. శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ కుటుంబానికి అండ‌గా ఉంటామ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించ‌గా.. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ కూడా ముందుకు వ‌చ్చారు. మాస్ట‌ర్ చికిత్స కోసం రూ.10ల‌క్ష‌ల ఆర్థిక సాయం చేశారు. శివ‌శంకర్ మాస్ట‌ర్‌, ఆయ‌న కుటుంబ స‌భ్యులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ధ‌నుష్ ఆకాంక్షించారు.

శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ కుటుంబ స‌భ్యుల్లో ఒకే సారి ముగ్గురికి క‌రోనా సోకింది. ఆయ‌నతో పాటు భార్య, పెద్ద కుమారుడు క‌రోనా బారిన ప‌డ్డారు. పెద్ద కొడుకు అప‌స్మార‌క స్థితిలో ఉన్నారు. శివ శంక‌ర్ మాస్ట‌ర్ భార్య హోం క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారు. చిన్న కుమారుడు అజయ్‌ కృష్ణ ఒక్కడే తండ్రి, అన్న, అమ్మ బాగోగులు చూసుకుంటున్నారు. కాగా.. టాలీవుడ్‌లో ఎన్నో సూప‌ర్ హిట్ పాట‌ల‌కు శివ‌శంక‌ర్ మాస్టర్ కొరియోగ్ర‌ఫీ చేశారు. మ‌రీ ఇలాంటి స‌మ‌యంలో టాలీవుడ్‌ నుంచి స్పందన లేకపోవడం ఏంటని నెటిజన్లు మండిప‌డుతున్నారు. ధనుష్‌ని చూసి టాలీవుడ్‌ హీరోలు నేర్చుకోవాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Next Story