ప్రభాస్‌తో పాటు ఆదిపురుష్ లో నటించిన ప్రతీ ఒక్కరికీ భారీ రెమ్యునరేషన్..!
Here’s how much Prabhas and Kriti Sanon charged for the magnum opus. ఆదిపురుష్ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్స్ ను అందుకుంటూ ఉంది.
By Medi Samrat Published on 19 Jun 2023 4:36 PM ISTఆదిపురుష్ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్స్ ను అందుకుంటూ ఉంది. శ్రీరామచంద్రుడిగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్,సీతగా కృతి సనన్, రావణ బ్రహ్మ పాత్రలో సైఫ్ అలీఖాన్ కనపించారు. జూన్ 16న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున రిలీజైంది. టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర సినిమా భారీ ఎత్తున కలెక్షన్స్ సాధిస్తూ అందరినీ ఆశ్యర్యపరుస్తోంది. తొలి రోజున దాదాపు రూ.140 కోట్ల మేరకు గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించిన ‘ఆదిపురుష్’ రెండో రోజు రూ.81 కోట్ల మేరకు గ్రాస్ వసూళ్లనుసాధించింది. ఇక మూడో రోజు రూ.85 కోట్లు వసూళ్లు వచ్చాయని బాక్సాఫీస్ వర్గాలంటున్నాయి. ఓం రౌత్ దర్శకత్వం వహించిన 'ఆదిపురుష్' సినిమాలో పలువురు స్టార్స్ ఉన్నారు. ఈ కాస్ట్ కోసం భారీ మొత్తంలో డబ్బు చెల్లించారు చిత్ర నిర్మాతలు.
ప్రభాస్ - 100-150 కోట్లు
బాహుబలి సినిమాతో ప్రభాస్ కు ప్రపంచ వ్యాప్తంగా ఫాలోయింగ్ వచ్చింది. ఆ సినిమా భారీ విజయంతో, అతను ఇప్పుడు దేశంలోని అతిపెద్ద స్టార్‌లలో ఒకడు అయ్యాడు. అతని రెమ్యునరేషన్ కూడా భారీగానే ఉండనుంది. నివేదికల ప్రకారం, ఆదిపురుష్‌లో శ్రీరాముడి పాత్ర కోసం ప్రభాస్ 100 కోట్ల రూపాయలకు పైగా పారితోషికం తీసుకున్నాడని అంటున్నారు. ప్రభాస్ రెమ్యునరేషన్ రూ. 100 – 150 కోట్ల మధ్య ఉండనుందని అంటున్నారు.
సైఫ్ అలీ ఖాన్ - 12 కోట్లు
ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో కనిపించాడు. సైఫ్ అలీ ఖాన్ రెండు దశాబ్దాలకు పైగా పరిశ్రమలో ఉన్నాడు.. అతని నటనకు అనేక అవార్డులు అందుకున్నాడు. ఆదిపురుష్ లో తన పాత్రకు దాదాపు రూ. 12 కోట్లు పారితోషికం తీసుకున్నాడు. బాలీవుడ్ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే విలన్‌లలో ఒకరిగా నిలిచాడు సైఫ్.
కృతి సనన్ - రూ. 3 కోట్లు
ఈ చిత్రంలో కథానాయికగా కృతి సనన్ కనిపించింది. సీతా మాతగా కృతి కనిపించింది. ఆదిపురుష్‌లో ఆమె పాత్రకు దాదాపు రూ. 3 కోట్ల పారితోషికం అందుకుంది. కెరీర్ లో అత్యంత అరుదైన పాత్ర కావడంతో అమ్మడికి పేరుతో పాటూ మంచి రెమ్యునరేషన్ కూడా వచ్చింది.
సన్నీ సింగ్ - 1.5 కోట్లు
ఈ చిత్రంలో లక్ష్మణుడిగా నటించిన సన్నీ సింగ్‌కు దాదాపు రూ.1.5 కోట్లు ఇచ్చారనే టాక్ వినిపిస్తూ ఉంది. తన ఆకట్టుకునే నటనతో, ఈ యంగ్ అండ్ డైనమిక్ యాక్టర్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆదిపురుష్‌లో లక్ష్మణుడి పాత్రలో మెప్పించాడు.
సోనాల్ చౌహాన్ - రూ. 50 లక్షలు
ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించింది. ఆమెకు దాదాపు రూ. 50 లక్షలు చెల్లించారని అంటున్నారు.
ఆదిపురుష్ సినిమాలోని స్టార్ కాస్ట్ కోసం భారీగా రెమ్యునరేషన్ ఇచ్చారని స్పష్టంగా తెలుస్తూ ఉంది.