నర్మదను పెళ్లి చేసుకున్న హీరో హరీష్ కళ్యాణ్

Harish Kalyan marries Narmada Udaykumar in Chennai. నాని జెర్సీ సినిమాలో కనిపించిన నటుడు హరీష్ కళ్యాణ్. అతడు నర్మదా ఉదయకుమార్ ను

By Medi Samrat  Published on  28 Oct 2022 2:15 PM GMT
నర్మదను పెళ్లి చేసుకున్న హీరో హరీష్ కళ్యాణ్

నాని జెర్సీ సినిమాలో కనిపించిన నటుడు హరీష్ కళ్యాణ్. అతడు నర్మదా ఉదయకుమార్ ను పెళ్లి చేసుకున్నాడు. ఈ ఉదయం పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. చెన్నైలోని తిరువెర్కాడులోని GPN ప్యాలెస్‌లో జరిగిన ఈ వివాహ వేడుకకు సన్నిహితులు, స్నేహితులు హాజరయ్యారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరికి సినీ ప్రముఖులు.. అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

చెన్నైలోని తిరువెర్కాడులోని జీపీఎన్ ప్యాలెస్ లో వీరి వివాహం జరిగింది. తమది పెద్దలు కుదిర్చిన వివాహం అని ఇటీవల తెలిపారు హరీష్. కుటుంబసభ్యులు నిశ్చయించిన తర్వాత మా మధ్య ప్రేమ చిగురించిందని.. నర్మదా ఉదయకుమార్ తన జీవిత భాగస్వామిగా రావడం సంతోషంగా ఉందన్నారు. తమిళ్ బిగ్ బాస్ సీజన్ 1లో హరీష్ కళ్యాణ్ రన్నరప్ గా నిలిచాడు.


Next Story