హరిహర వీరమల్లు.. మొద‌టి వారం కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీర మల్లు: పార్ట్ 1 — స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ గత వారం థియేటర్లలో విడుదలైంది.

By Medi Samrat
Published on : 31 July 2025 2:35 PM IST

హరిహర వీరమల్లు.. మొద‌టి వారం కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీర మల్లు: పార్ట్ 1 — స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ గత వారం థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు అనుకున్నంత హైప్ రాలేదు. హరి హర వీర మల్లు బడ్జెట్ కారణంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి వారం అనుకున్న ఫలితాలను రాబట్టలేకపోయింది. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా ₹107 కోట్ల గ్రాస్ వసూలు చేసి ₹65 కోట్ల షేర్ వసూలు చేసింది,

పవన్ కళ్యాణ్ సినిమాకు ఉండే ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. కానీ ఊహించని విధంగా హరిహర వీరమల్లు హైప్ రాలేకపోయింది. ఆయన స్టార్డమ్ ను తీసుకుంటే హరి హర వీర మల్లు సినిమా మొదటి వారం బాక్సాఫీస్ వద్ద దారుణమైన వసూళ్లను సాధించింది, ఇప్పటివరకు ఈ సినిమా సాధించిన కలెక్షన్లు దాదాపుగా ముగింపు కలెక్షన్లకు సమానం. ప్రీమియర్లతో సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చినా అది వీకెండ్ వరకూ కంటిన్యూ చేయలేకపోయింది.

Next Story