సీఎం యోగిని కలిసిన హనుమాన్ టీమ్

హనుమాన్ సినిమా చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ, ఆ చిత్ర కథానాయకుడు తేజ సజ్జా బుధవారం నాడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను

By Medi Samrat  Published on  24 Jan 2024 8:55 PM IST
సీఎం యోగిని కలిసిన హనుమాన్ టీమ్

హనుమాన్ సినిమా చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ, ఆ చిత్ర కథానాయకుడు తేజ సజ్జా బుధవారం నాడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను లక్నోలోని ఆయన కార్యాలయంలో కలిశారు. హనుమాన్ సినిమా గురించి పలు విషయాలను తెలియజేశారు. ‘హనుమాన్’ సినిమాలో మేం చేసిన ప్రయత్నాన్ని సీఎం యోగి ఆదిత్యనాథ్ అభినందించారని చెప్పారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఆధ్యాత్మికతను ఇలా అర్థం చేసుకొనే ముఖ్యమంత్రి ఉండటం గ్రేట్ అని.. ఇటువంటి ప్రోత్సాహాలు మేం మరిన్ని కొత్త ప్రయోగాలు చేయడానికి మనకు స్ఫూర్తిని ఇస్తుందని చెప్పారు. యోగి జీని కలవడం నిజంగా తమకు ఒక గౌరవం అని చిత్ర యూనిట్ తెలిపింది.

హనుమాన్ సినిమా భారీ హిట్ తర్వాత ఆ సినిమా సీక్వెల్ మీద దృష్టి పెట్టాడు దర్శకుడు సుధీర్ వర్మ. హనుమాన్ సినిమాకి సీక్వెల్ గా 'జై హనుమాన్' ను ప్లాన్ చేశామని తెలిపారు సుధీర్ వర్మ. సీక్వెల్ లో హనుమంతుడి పాత్ర ప్రేక్షకుల ముందుకు వస్తుందని.. హనుమంతుడిగా ఎవరు చేయనున్నారనేది మరికొన్ని రోజుల్లో ఎనౌన్స్ చేస్తామని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం పరంగా ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తుందని నేను నమ్మకంగా చెప్పగలనని హామీ ఇచ్చారు ప్రశాంత్ వర్మ.

Next Story